
అక్కినేని అఖిల్ మరియు జైనబ్ వివాహం తర్వాత, వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో అఖిల్ భార్య జైనబ్ మరియు నాగచైతన్య భార్య శోభిత ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
Key Points
అక్కినేని అఖిల్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అఖిల్ భార్య జైనబ్ మరియు నాగచైతన్య భార్య శోభిత ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.
అక్కినేని ఫ్యామిలీలో సంతోషం పట్టలేకపోతోంది.
అఖిల్ – జైనబ్ వివాహం
Akkineni Family : ఇటీవల జూన్ 6న అక్కినేని అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్జీ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లోనే జరిగింది. వీరి వివాహానికి అనేకమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అఖిల్ పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరికొన్ని అఖిల్ పెళ్లి ఫోటోలు బయటకు రాగా ఓ ఫొటో స్పెషల్ గా మారింది.
ఈ ఫొటోలో అక్కినేని కోడళ్ళు ఇద్దరూ ఉన్నారు. నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ – అఖిల్ భార్య జైనబ్ ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ స్పెషల్ మూమెంట్ లో ఉన్నారు. ఇలా ఇద్దరు అక్కినేని కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటో క్యూట్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో
వైరల్ ఫోటో
గత సంవత్సరం డిసెంబర్ లో నాగచైతన్య – శోభిత ధూళిపాళ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోనే అక్కినేని ఫ్యామిలీకి రెండో కోడలు కూడా రావడంతో ఫ్యామిలీ కళకళలాడుతుందని అంటున్నారు.
అఖిల్ పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీలో నిండుకుటుంబ సంతోషం. కోడళ్ళిద్దరి ఫోటో వైరల్ అవడం ఫ్యాన్స్ కి పెద్ద సంతోషం.


