|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగ్ 100వ సినిమా: తమిళ దర్శకుడితో రిస్క్ చేస్తున్నారా? అక్కినేని అభిమానుల్లో ఆందోళన!

Published: 18-03-2026, 6:05 AM
నాగ్ 100వ సినిమా: తమిళ దర్శకుడితో రిస్క్ చేస్తున్నారా? అక్కినేని అభిమానుల్లో ఆందోళన!
  • నాగార్జున 100వ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయనున్నారు.
  • ‘మేడ్ ఇన్ కొరియా’ సినిమా ఫలితం రా కార్తీక్ పై అనుమానాలు పెంచుతోంది.
  • తెలుగు దర్శకులు ఉండగా పరభాషా దర్శకుడికి అవకాశం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
  • 100వ సినిమా ‘శివ’ రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్‌లో దర్శకుల ఎంపిక విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. నాగార్జున తన 100వ సినిమా కోసం తమిళ దర్శకుడు రా కార్తీక్‌ను ఎంచుకోవడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నిర్ణయం సరైనదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాగ్ 100వ సినిమాకు తమిళ దర్శకుడు ఎందుకు?

Akkineni nagarjuna: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వింత ట్రెండ్ నడుస్తోంది. మన దగ్గర టాలెంటెడ్ దర్శకులు క్యూలో ఉన్నా, మన హీరోలు మాత్రం పక్క రాష్ట్రం దర్శకులపై మోజు పడుతున్నారు. తాజాగా ‘కింగ్’ నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం అక్కినేని అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ముఖ్యంగా రా కార్తిక్ రీసెంట్ మూవీ’మేడ్ ఇన్ కొరియా’రిజల్ట్ చూశాక.. ‘నాగ్ రిస్క్ చేస్తున్నారా?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మేడ్ ఇన్ కొరియా’.. ఎమోషన్స్ మిస్సయ్యాయా? విషయంలోకి వస్తే  రా కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ‘మేడ్ ఇన్ కొరియా’పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. విజువల్స్ బాగున్నాయి కానీ, కథలో ఉండాల్సిన అసలైన ఎమోషన్స్ ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కథనాన్ని నడిపించడంలో దర్శకుడు తడబడ్డారని, చాలా సీన్లు సహజత్వానికి దూరంగా ఉన్నాయన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫలితంగా సినిమాకు ‘మిక్స్‌డ్ టాక్’ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

రా కార్తీక్ ‘మేడ్ ఇన్ కొరియా’ ఫలితం ప్రభావం

తెలుగు దర్శకులు ఉండగా.. తమిళ వాళ్లే ఎందుకు? ఇక్కడే అక్కినేని అభిమానుల అసలు ఆవేదన మొదలైంది. తెలుగు నేటివిటీని, నాగార్జున బాడీ లాంగ్వేజ్‌ను పక్కాగా అర్థం చేసుకునే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు మన టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పటికే  విభిన్నమైన కథలతో హిట్లు కొడుతున్న మనోళ్లను కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర ప్రయోగాలు చేసే దర్శకులకు 100వ సినిమా లాంటి మైలురాయిని అప్పగించడం అవసరమా? అన్నది ఫ్యాన్స్ సూటి ప్రశ్న. ఇలా  గతంలో కూడా పరభాషా దర్శకులతో నాగ్ చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసికొట్టిన చేదు అనుభవాలు చాలానే  ఉన్నాయి.

100వ సినిమా అంటే ‘శివ’ రేంజ్ లో ఉండాలి కానీ.. నిజానికి  ఏ హీరోకైనా 100వ సినిమా అనేది ఒక ఎమోషన్. అది చరిత్రలో నిలిచిపోవాలి. ఇక  నాగార్జున అంటే ‘శివ’, ‘అన్నమయ్య’, ‘మన్మధుడు’ వంటి ట్రెండ్ సెట్టర్లకు కేరాఫ్ అడ్రస్. అలాంటి స్టార్ హీరో సెంచరీ కొట్టబోయే సినిమా ఒక ప్రయోగాత్మక దర్శకుడి చేతిలో ఉందంటే భయం వేయడం సహజమే. ఇక ‘మేడ్ ఇన్ కొరియా’ లాంటి ఫలితమే నాగ్ 100వ సినిమాకు పునరావృతమైతే.. అక్కినేని ఫ్యాన్స్ ఆ బాధను తట్టుకోవడం కష్టం.

అక్కినేని అభిమానుల ఆందోళనకు కారణం ఏమిటి?

రా కార్తిక్ పై నమ్మకం ఉందా? అనుమానం ఉందా? మరో వైపు  దర్శకుడిగా రా కార్తిక్‌కు ఇది లైఫ్ అండ్ డెత్ లాంటి ప్రాజెక్ట్. నాగార్జున వంటి సీనియర్ స్టార్‌ను హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే, ‘మేడ్ ఇన్ కొరియా’లో ఆయన చూపించిన లోపాలను నాగ్ సినిమా విషయంలో సరిదిద్దుకుంటారా? లేక తన పాత పంథాలోనే వెళ్లి నాగ్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నాగార్జున జడ్జిమెంట్ మీద నమ్మకం ఉన్నా.. దర్శకుడి రీసెంట్ ట్రాక్ రికార్డ్ మాత్రం టెన్షన్ పెడుతోంది.మన తెలుగు దర్శకులకు  కాకుండా ఈ  అవకాశం పరభాషా దర్శకుడికి  ఎందుకు ఇస్తున్నారో నాగార్జునే  ఆలోచించాలి. ఏది ఏమైనా  100వ సినిమా అంటే ఒక ఉత్సవంలా ఉండాలి.. కానీ అది ఒక ‘ప్రయోగశాల’గా మారకూడదని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. మొత్తానికి మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అవుతున్న వేళ.. మన హీరోలు ఇంకా పక్క రాష్ట్రాల వైపు చూడటం టాలీవుడ్ దురదృష్టం

read also: చిరు, వెంకీలకు ‘లైఫ్’ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్

మొత్తానికి నాగార్జున 100వ సినిమా రా కార్తీక్ దర్శకత్వంలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. అభిమానుల అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ తేడా వస్తే మాత్రం అభిమానులు తట్టుకోలేరు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.