
📌 Key Points
- సురేఖ వాణి ఒకప్పుడు టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాగా పాపులర్.
- భర్త మరణం తర్వాత సురేఖ వాణి సినిమాలకు దూరం అయ్యారు.
- సురేఖ వాణి రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సుప్రీత స్పందించారు.
- సుప్రీత హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
సురేఖ వాణి రెండో పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె కుమార్తె సుప్రీత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం గురించి కూడా మాట్లాడారు.
సురేఖ వాణి సినీ కెరీర్ గురించి కొన్ని విషయాలు
Supritha: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఒకానొక సమయంలో ఏదైనా సినిమాలో అక్క వదిన లేదా పిన్ని పాత్రలు ఉన్నాయి అంటే టక్కున సురేఖ వాణి గుర్తుకు వచ్చేవారు . ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించి సురేఖ వాణి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే తన భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత ఈమె సినిమాలను కూడా పూర్తిగా తగ్గించారని చెప్పాలి .ఇటీవల కాలంలో సురేఖవాణి (Surekha Vani)సినిమాలకు దూరమయ్యారు అయితే అవకాశాలు లేక దూరమయ్యారా లేకపోతే ఈమె ఇండస్ట్రీకి దూరం ఉన్నారా అనే విషయాల పట్ల క్లారిటీ లేదు కానీ సురేఖ వాణి మాత్రం పూర్తిగా సినిమాలను తగ్గించారు.
ఇకపోతే కరోనా సమయంలో తన భర్త అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. తన భర్త మరణం తర్వాత సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఈమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈమె సింగిల్గానే ఉన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత తన తల్లి రెండు పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో నన్ను ప్రశ్నిస్తూ అమ్మకు పెళ్లి చేసే ఆలోచన ఉందా అని అడిగారు దాంతో అవునని చెప్పాను.
రెండో పెళ్లి వార్తలపై సుప్రీత క్లారిటీ
ఈ విషయాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుని సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం చేశారు కానీ నిజం కాదని తెలిపారు. నేను జీవితంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయిన తర్వాత అమ్మ ఒంటరిగా ఉండిపోతుంది అందుకే తనకు పెళ్లి చేయాలని నేను భావించాను కానీ అమ్మకు మాత్రం రెండో పెళ్లి గురించి ఆలోచన లేదని సుప్రీత ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇలా సురేఖ వాణి రెండో పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ సుప్రీత మాత్రం ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అమ్మకు అలాంటి ఉద్దేశం లేదని తెలిపారు.
ఇక ప్రస్తుతం సురేఖ వాణి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తన కుమార్తె సుప్రీతను మాత్రం ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు ఇప్పటికే ఈమె అమరావతికి ఆహ్వానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరో తమిళ సినిమాతో పాటు తెలుగులో మరొక సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే .ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా తల్లి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సుప్రీత కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టారు. మరి హీరోయిన్ గా సుప్రీత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
హీరోయిన్‌గా సుప్రీత ఎంట్రీ
సుప్రీత హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, సురేఖ వాణి రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


