
📌 Key Points
- బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కారు ముంబైలో ప్రమాదానికి గురైంది.
- భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి వెళ్తుండగా జూహు సమీపంలో యాక్సిడెంట్.
- ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అక్షయ్ దంపతులు క్షేమంగా బయటపడ్డారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారు ముంబైలో ప్రమాదానికి గురైంది. ఆయన తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు.
ముంబైలో అక్షయ్ కుమార్ కారు ప్రమాదం
Akshay kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం జరిగింది.. ముంబైలో ఆయన భార్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన ఆ పర్యటనను ముగించుకొని తిరిగి ఇండియాకి వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్ నుంచి వేగంగా అక్షయ్ కారు బయలుదేరింది. జూహు సమీపంలోకి రాగానే యాక్సిడెంట్ కు గురైంది. అక్షయ్ కుమార్ సెక్యూరిటీ వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. దాంతో అక్షయ్ కుమార్ కారును ఢీకొట్టింది. కార్లు అతి వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అక్షయ్ కుమార్ ఆయన భార్య ట్వింకిల్ కన్నా ఆ కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి గురైన సమయంలో ఆయన కారులోని ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవడంతో అక్షయ్ కుమార్ దంపతులు క్షేమంగా బయటపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో వీరిద్దరికీ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీరు పరిస్థితి ఎలా ఉందో మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి..
భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా ఘటన
క్షేమంగా బయటపడ్డ అక్షయ్ దంపతులు
అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కారు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చే విషయం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.


