
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు.
- కుస్తీ పోటీ సన్నివేశంలో కంటిపై గాయం కావడంతో నాలుగు కుట్లు పడ్డాయి.
- గాయం తీవ్రంగా లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది.
- రామ్ చరణ్ రేపటి నుండి తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. కుస్తీ సన్నివేశం చిత్రీకరిస్తుండగా కంటికి గాయం కావడంతో నాలుగు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
రామ్ చరణ్‌కు షూటింగ్‌లో ప్రమాదం
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే షూటింగ్ ఇంకా పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఎక్కడ ఈ వార్తలపై అధికారకంగా స్పందించలేదు. ఇక ఈ సినిమాలో ఒక వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఇలా షూటింగ్ పనులను శరవేగంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈయన ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.
ఈ విధంగా రాంచరణ్ ఈ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురి అయ్యారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రామ్ చరణ్ కు ఎలాంటి ప్రమాదం జరిగింది ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ విషయంపై రామ్ చరణ్ టీం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు జరిగిన ప్రమాదం పట్ల స్పందిస్తూ ప్రస్తుతం కుస్తీ పోటీకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చిన్న ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో భాగంగా రామ్ చరణ్ కంటి పై భాగంలో చిన్నపాటి గాయం తగిలిందని, నాలుగు కుట్లు పడినట్లు పెద్ది టీం తెలిపారు.
గాయంపై రామ్ చరణ్ టీమ్ స్పందన
ఇలా కంటి పై భాగంలో దెబ్బ తగిలినప్పటికీ కంటికి ఎలాంటి ప్రమాదం లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. ఇలా రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినప్పటికీ ఈయన షూటింగుకు ఎలాంటి విరామం ఇవ్వకుండా రేపటి నుంచి యధావిధిగా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ఇలా రామ్ చరణ్ కంటి పై భాగంలో నాలుగు కుట్లు పడ్డాయనే విషయం తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భయపడాల్సిన పని లేదని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
పెద్ది పైనే మెగా అభిమానుల ఆశలు..
షూటింగ్‌కు విరామం ఉండదు
ఇలా రామ్ చరణ్ ప్రమాదానికి గురి కావడంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరొక వారం రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మరి అనుకున్న విధంగానే ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా లేదంటే మరోసారి వాయిదా వేయబోతున్నారా అనేది తెలియాల్సిందే. నిజానికి ఈ సినిమాని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీని విడుదల చేయాల్సి ఉంది. షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి ఈ సినిమా ద్వారా చరణ్ బ్లాక్ బస్టర్ అందుకోబోతుందని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్‌కు స్వల్ప గాయం కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆయన క్షేమంగా ఉన్నారని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.


