
📌 Key Points
- తారకరత్న రాజకీయాల్లోకి వస్తానంటే వద్దన్నానని తెలిపిన అలేఖ్య రెడ్డి.
- చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే విముఖత అని తెలిపిన అలేఖ్య.
- భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందన్న అలేఖ్య.
- విజయ్ సాయి రెడ్డి బాబాయ్, పిన్ని వాళ్ళతోనే ఎక్కువగా పెరిగానని తెలిపిన అలేఖ్య.
నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె రాజకీయాలపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాజకీయాలంటే విముఖత ఎందుకు?
Alekhya Tarakaratna : హీరో నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చి మొదటిసారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య.
గతంలో తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వస్తారు అని వార్తలు వచ్చాయి. యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో అలేఖ్య పాలిటిక్స్ గురించి మాట్లాడింది.
తారకరత్న రాజకీయ ఆశలపై అలేఖ్య కామెంట్స్
అలేఖ్య మాట్లాడుతూ.. మా అమ్మ వాళ్ళ నాన్న, మా తాతయ్య కాంగ్రెస్ లో ఉన్నారు. వైఎస్సార్ తో క్లోజ్. టీడీపీ నుంచి మా మామయ్య పోటీ చేసారు. మాది పొలిటికల్ ఫ్యామిలీనే. విజయ్ సాయి రెడ్డి బాబాయ్, పిన్ని వాళ్ళతోనే నేను ఎక్కువగా పెరిగాను. నాకు వాళ్ళు బాగా క్లోజ్. అప్పుడప్పుడు తారక్ పాలిటిక్స్ గురించి అయితే మాట్లాడేవాళ్ళు. సినిమాల గురించి మాత్రం మాట్లాడలేదు.
అలేఖ్య మనసు మార్చుకున్నారా?
చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా పాలిటిక్స్ లో ఉండటంతో వాళ్ళెవరూ ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే తారక్ పాలిటిక్స్ లోకి వెళ్తాను అంటే నేను వద్దన్నాను. నాకు ఇష్టం లేదు. మాకు టైం ఇవ్వరేమో అనుకున్నాను. నాకు ఇప్పటిదాకా అయితే ఆలోచన ఏం లేదు పాలిటిక్స్ లోకి రావాలని. భవిష్యత్తులో రావాలి అనుకుంటే వస్తానేమో. లేకపోతే లేదు. మనం అనుకున్నది జరుగుతుందో జరగదు తెలీదు అని తెలిపింది.
అలేఖ్య రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


