
📌 Key Points
- దివంగత నటుడు తారకరత్న భార్యగా అలేఖ్య అందరికీ సుపరిచితం.
- తారకరత్న మరణం తర్వాత అలేఖ్య మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
- రాజకీయాల్లోకి వచ్చే అవకాశం గురించి అలేఖ్య క్లారిటీ ఇచ్చారు.
- అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని అలేఖ్య తెలిపారు.
దివంగత నటుడు తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న పొలిటికల్ ఎంట్రీ గురించి మొదటిసారిగా స్పందించారు. ఆమె రాజకీయాల్లోకి వస్తారా రారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
అలేఖ్య తారకరత్న నేపథ్యం
Alekhya Tarakaratna: అలేఖ్య తారక రత్న పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ దివంగత నటుడు తారకరత్న(Tarakaratna) భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. తారకరత్న మరణం వరకు ఎవరికీ పరిచయం లేని అలేఖ్య(Alekhya) ఆయన మరణం తర్వాత ఒకసారిగా వార్తలలో నిలిచారు. ఇక తారకరత్న మరణం తర్వాత తన భర్తకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేసేవారు అయితే మొదటిసారి ఈమె తన భర్త మరణం తర్వాత బయటకు వచ్చారు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజకీయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈమె నందమూరి ఇంటికి కోడలుగా వచ్చినప్పటికీ చిన్నప్పటినుంచి రాజకీయ అనే పద్యం ఉన్న కుటుంబంలో జన్మించిన సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ నాయకుడు విజయ్ సాయి రెడ్డి స్వయాన అలేఖ్య రెడ్డికి చిన్నాన్న అవుతారు. ఇలా చిన్నప్పటి నుంచి రాజకీయాలలో పుట్టి పెరిగిన ఈమె రాజకీయాలలోకి రాబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది. తారకరత్న కూడా రాజకీయాలలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఆదిశగా అడుగులు వేశారు అంతలోపే ఆయన మరణం అందరిని ఎంతగానో కలచివేసింది. ఇప్పుడు తారకరత్న స్థానంలో అలేఖ్య రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
రాజకీయాలపై అలేఖ్య కామెంట్స్
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా అలేఖ్య మాట్లాడుతూ.. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బహుశా రేపటి పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలలోకి రావచ్చు రాకపోవచ్చు అంటూ ఈమె పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్స్ చేశారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయాలు గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇలా అవసరం అనుకుంటే అలేఖ్య రాజకీయాలలోకి రావడానికి సిద్ధంగానే ఉన్నారని చెప్పకనే చెప్పేశారు. చిన్నప్పటినుంచి రాజకీయ కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినప్పటికీ తనకంటూ రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి అవగాహన కూడా లేదని తెలిపారు.
ఇలా రాజకీయాలపై అవగాహన లేకపోయినప్పటికీ పరిస్థితులను బట్టి తాను రాజకీయాలలోకి వచ్చే అవకాశాలే ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇక తారకరత్న కూడా రాజకీయాలలోకి రావడం గురించి ఈమె మాట్లాడారు. తారకరత్న రాజకీయాలలోకి వెళ్తాను అని చెప్పగానే మమ్మల్ని చాలా మిస్ అవుతారని భావించాను . ముఖ్యంగా పిల్లలు మిస్ అవుతారని ఈమె తెలిపారు. చిన్నప్పటి నుంచి మా తాతయ్య నాన్న వాళ్ళు రాజకీయాలలో ఉండటం వల్ల మేము వారితో మాట్లాడాలన్న అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలా తారక్ కూడా రాజకీయాలలోకి వస్తే మేం అతన్ని మిస్ అవుతాం అనుకున్నాం కానీ మేము ఊహించనది జరిగింది అంటూ తారకరత్న మరణం పై ఎమోషనల్ అయ్యారు.
తారకరత్న రాజకీయ ఆశయాలు
చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో పెరిగినప్పటికీ, రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని అలేఖ్య తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పడం గమనార్హం.


