
దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో వస్తున్న “కాంత” చిత్రం విడుదల తేదీ ఖరారైంది. దీపావళి సందర్భంగా నవంబర్ 14న ఈ 1950ల నేపథ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ ఇప్పటికే ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Key Points
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సె ప్రధాన పాత్రల్లో నటించారు.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి సహ నిర్మాణంలో సినిమా.
"కాంత" చిత్రం నవంబర్ 14న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల.
1950ల నేపథ్యంతో, టీజర్ ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
“కాంత” సినిమా విశేషాలు: నటీనటులు, సాంకేతిక వర్గం
దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కాంత. ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి మరియు జాన్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ్ రెండు భాషాల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక దీపావళి సందర్భంగా సినిమాపై చిత్రయూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక ఈ సినిమా 1950s రాబోతుండగా, టీజర్ ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచానాలను రీచ్ అవుతుందా లేదా చూడాలి.
దీపావళి కానుకగా “కాంత” విడుదల తేదీ
1950ల నేపథ్యం: సినిమాపై అంచనాలు
1950ల నేపథ్యంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన “కాంత” సినిమా టీజర్‌తోనే ఆకట్టుకుంది. నవంబర్ 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి. అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.


