
📌 Key Points
- అలియా భట్ సోదరి షాహీన్ భట్, ఇషాన్ మెహ్రీతో నిశ్చితార్థం చేసుకున్నారు.
- షాహీన్ భట్ ఒక స్క్రీన్ రైటర్, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
- ఇషాన్ మెహ్రీ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేస్తున్నారు.
- అలియా భట్ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు.
బాలీవుడ్ నటి అలియా భట్ సోదరి షాహీన్ భట్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇషాన్ మెహ్రీతో ఆమె ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
షాహీన్ భట్ నిశ్చితార్థ వేడుక
Alia Bhatt: 2026 కొత్త సంవత్సరం టాలీవుడ్ ని మొదలుకొని బాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సోదరి కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ విషయం తెలియగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అలియా భట్ కి సోదరీ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు . పైగా ఆమె ఆలియా కంటే పెద్దది.. దీనికి తోడు అలియా తర్వాత వివాహం చేసుకోవడానికి సిద్ధం అవ్వడంతో పలు రకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ బాలీవుడ్ బడా దర్శకుడు మహేష్ భట్, సోనీ రజాన్ ల పెద్ద కుమార్తె అయిన షాహీన్ భట్ (Shahin Bhatt) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె స్క్రీన్ రైటర్ గా సత్తా చాటుతోంది. అలాగే మానసిక ఆరోగ్యం పై కూడా తన వంతు అవగాహన కల్పిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. తాజాగా షాహిన్ భట్ నిశ్చితార్థం చేసుకుంది . ఇషాన్ మెహ్రీ (Ishan mehri) అనే వ్యక్తితో కలిసి ఉంగరాలు మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ . పైగా ఈ వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇషాన్ తో కలిసి ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ..” మేము ఒకరినొకరు ఇష్టపడడంలో కాస్త అతి చేసామేమో” అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అలియా భట్ సోదరి, ప్రముఖ స్క్రీన్ రైటర్ షాహిన్ భట్ షేర్ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు.. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే అలియా భట్ అత్త నీతూ కపూర్, తల్లి సోనీ రజాన్, అనన్య పాండే, జోయా అక్తర్ , షణయా కపూర్ , నీనాగుప్త తదితరులు షాహీన్- ఇషాన్ కాబోయే దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
షాహీన్ భట్ గురించి కొన్ని విషయాలు
షాహిన్ కాబోయే భర్త ఇషాన్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఈయన స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కోచ్ గా రాణిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇషాన్ మెహ్రీ నేపథ్యం
అలియా భట్ విషయానికి వస్తే మహేష్ భట్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల తార. ఇక ఈమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయికి రాహా అంటూ నామకరణం కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ.
Tags Alia Bhatt bollywood Share
మొత్తానికి అలియా భట్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. షాహీన్, ఇషాన్ ల జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.


