|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమాపై అల్లు అరవింద్ సంచలన రివ్యూ: ‘బాస్ ఈజ్ బ్యాక్’!

Published: 12-01-2026, 10:30 AM
చిరంజీవి సినిమాపై అల్లు అరవింద్ సంచలన రివ్యూ: 'బాస్ ఈజ్ బ్యాక్'!
  • చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు.
  • ఈ సినిమా చిరంజీవి పాత సినిమాలను గుర్తు చేసిందని అల్లు అరవింద్ అన్నారు.
  • వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్ క్లైమాక్స్ అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు.
  • చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఇది బెస్ట్ ఫిలిం అని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చూసి రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని, పాత రోజులను గుర్తు చేసిందని ఆయన అన్నారు.

అల్లు అరవింద్ సినిమా రివ్యూ

Allu Aravind: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి ఇలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సినిమా చూసిన సంగతి తెలిసిందే .అయితే చిరంజీవి బావగారు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం ఈ సినిమా చూశారని తెలుస్తోంది. ఈ సినిమా చూసిన అనంతరం అల్లు అరవింద్ తన అభిప్రాయాలను తెలియజేశారు. చిరంజీవి నటించిన ఈ సినిమా చూస్తుంటే ఆయన ఓల్డ్ సినిమాలు గుర్తుకొస్తున్నాయని అల్లు అరవింద్ తెలియజేశారు.

చిరంజీవి నటనపై ప్రశంసలు

ఒక మాటలో చెప్పాలంటే బాస్ ఈజ్ బాస్.. రౌడీ అల్లుడు ,ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసిన తర్వాత అదే భావన ఇప్పుడు కలుగుతుందని అల్లు అరవింద్ తెలిపారు. డాన్స్ పరంగా కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  పరంగా వింటేజ్ చిరంజీవి గారిని చూపించారని చించేశారు అంటూ ఈయన తెలియజేశారు .ఇక వెంకటేష్ పాత్ర గురించి కూడా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ క్లైమాక్స్ అదిరిపోయింది.. సినిమా సూపర్ హిట్ , చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఫిలిం అంటూ  మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాపై అల్లు అరవింద్ ఇచ్చిన ఈ రివ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

గత కొంతకాలంగా మెగా అలు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఈ వార్తలను ఖండిస్తూ ఈ రెండు కుటుంబాలు కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అల్లు అరవింద్ సైతం చిరంజీవి గురించి ఆయన సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడటంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సందడి చేశారు. ఈ సినిమాని సాహు గారు పాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ మధ్య సఖ్యత

అల్లు అరవింద్ చిరంజీవి సినిమా గురించి గొప్పగా మాట్లాడటంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య సఖ్యత కొనసాగుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇరు కుటుంబాల అభిమానులకు శుభవార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.