
📌 Key Points
- అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలంటూ సోషల్ మీడియాలో వార్తలు.
- నిబంధనల గురించి బ్రాండ్ మేనేజర్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
- అల్లు అర్జున్ టీమ్ ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
- పుష్ప నటుడు రాజశేఖర్ అనింగి అల్లు అర్జున్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన టీమ్ స్పందిస్తూ అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. పుష్ప నటుడు రాజశేఖర్ సైతం ఖండించారు.
అల్లు అర్జున్ 42 నిబంధనల వ్యవహారం
Allu Arjun 42 Rules: పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.బ్రాండ్ మేనేజర్ కావేరి బారువా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ ని కలవాలి అంటే కొన్ని నిబంధనలు పాటించాలి అంటూ ఈమె ఏకంగా 42 నిబంధనల గురించి తెలియజేశారు ఆయనని కలిసినప్పుడు తనని సార్ అంటూ గౌరవంగా పిలవాలి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు, తన ముందు ఇతరులు చెప్పులు వేసుకుని నిలబడకూడదు అంటూ కొన్ని నిబంధనలను తెలియజేశారు.
ఇలా ఈ పాడ్ కాస్ట్ లో భాగంగా అల్లు అర్జున్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఇదే అదునుగా భావించి బన్నీ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై అల్లు అర్జున్ టీం స్పందిస్తూ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇక అల్లు అర్జున్ 42 నిబంధనల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో పాటు నటించిన నటుడు రాజశేఖర్ అనింగి(Rajasekhar Aningi) తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ఈయన అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ తప్పుడు వార్తలను తాను ఖండిస్తున్నానని తెలిపారు.. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు పుష్ప సినిమా కోసం అతనితో కలిసి నడిచానని తనని దగ్గరగా చూసిన తర్వాత ఆయన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఈ వార్తలను తాను ఖండిస్తున్నానని తెలిపారు..
సోషల్ మీడియాలో దుమారం రేపిన రూల్స్
Condemning the fake propaganda against #AlluArjun garu! 🚫 Having acted alongside him in #pushpa I can vouch for his character. He is a true gentleman on set. These “rules” rumors are purely for cheap publicity. Don’t believe them! We stand with the Icon Star! ✊🔥 @alluarjun pic.twitter.com/7lGN9vmahH
— Subhodayam Subbarao (@rajasekharaa) February 10, 2026
స్పందించిన పుష్ప నటుడు రాజశేఖర్ అనింగి
అల్లు అర్జున్ నిబంధనల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా చౌకబారు వార్తలని కొట్టి పారేశారు. ఈ వార్తలను ఎవరు నమ్మదు. జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఇక ఈయన పుష్ప సినిమా షూటింగ్ విరామ సమయంలో అందరితోను సరదాగా ఉండేవారు అంటూ నటుడు రాజశేఖర్ అనింగి అల్లు అర్జున్ గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి ఇలాంటి వార్తలు బయటకు రావడంతో ఇదే అదునుగా భావించిన యాంటీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బన్నీపై విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే .
అల్లు అర్జున్ గురించి వస్తున్న ఈ రూల్స్ వివాదం ఒక పక్క దుమారం రేపుతున్నప్పటికీ, ఆయన సన్నిహితులు, టీమ్ మాత్రం ఖండిస్తూ అసలు నిజం వేరే ఉందని చెబుతున్నారు.


