
📌 Key Points
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కుతోంది.
- దుబాయ్‌లో షూటింగ్ కోసం ప్రత్యేక సెట్ వేయగా, కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది.
- ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్ షెడ్యూల్ వాయిదా పడింది.
- సినిమా 70% షూటింగ్ పూర్తయింది, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ విడుదల కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దుబాయ్ షెడ్యూల్‌ను వాయిదా వేశారు.
అల్లు అర్జున్ – అట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీ
Allu Arjun -Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లు సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయికి మాత్రమే పరిమితం చేయకుండా అట్లీ గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ కోసం అట్లీ ప్రత్యేకమైన భారీ సెట్స్ కూడా వేయించారని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఇప్పటికే దుబాయిలో ప్రత్యేకమైన సెట్ వేశారట. ఇందులో కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ దుబాయిలో షూటింగ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు కావడంతో ఈయన పుట్టినరోజును పూర్తిచేసుకుని ఏప్రిల్ 8వ తేదీ తరువాత దుబాయ్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా(US) ఇరాన్ (Iran)మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధ దాటికి ప్రభావితం అవుతున్న సంగతి తెలిసిందే.
యుద్ధం కారణంగా దుబాయ్ షెడ్యూల్ వాయిదా
ఇలా గల్ఫ్ దేశాలపై యుద్ధ ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ విమాన రాకపోకలను కూడా నిలిపి వేస్తున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు కూడా మందగించాయి. ఇలాంటి పరిస్థితులలో చిత్ర బృందం దుబాయ్ వెళ్లి అక్కడ షూటింగ్ జరపడం అంటే గగనం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాతలు దుబాయ్ షెడ్యూల్ చిత్రీకరణ నిలిపి వేశారని మరికొద్ది రోజుల తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే దుబాయ్ కి వెళ్లి షూట్ చేయాలని భావిస్తున్నారట. ఇలా యుద్ధం కారణంగా అల్లు అర్జున్ సినిమా పై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.
బన్నీ బర్త్ డే స్పెషల్.. టైటిల్ రివీల్..
సినిమా టైటిల్ ఎప్పుడు విడుదల కానుంది?
ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో భారీగా అంచనాలు ఉన్నాయి .ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా అట్లీ జాగ్రత్త పడుతున్నారు. ఇక ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించకపోయిన, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తెలియజేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధ పరిస్థితుల కారణంగా షూటింగ్ వాయిదా పడటం సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత చిత్ర బృందం తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ఎదురుచూస్తున్నారు.


