|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అల్లు అర్జున్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేసేది ఎవరో తెలుసా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్!

Published: 10-03-2026, 2:35 AM
షాకింగ్: అల్లు అర్జున్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేసేది ఎవరో తెలుసా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్!
  • అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ గ్లింప్స్‌ను షారుఖ్ ఖాన్ విడుదల చేయనున్నారు.
  • ఏప్రిల్ 7న రాత్రి 11:59 గంటలకు టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది.
  • ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, దీపికా పదుకొనే, అట్లీ వర్చువల్‌గా పాల్గొననున్నారు.
  • పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రమోషన్లకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ విడుదల చేయనున్నారు. ఈ గ్లింప్స్‌ ఏప్రిల్ 7న రాత్రి విడుదల కానుంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టైటిల్ గ్లింప్స్ విడుదల ఎప్పుడు?

AA22 Glimpse: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఒక భారీ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుండే ఈ ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. ఈ సినిమా గ్లింప్స్‌ను ఏప్రిల్ 7న రాత్రి 11:59 PM కు విడుదల చేయబోతున్నారు. అయితే, ఇందులో అసలైన విశేషం ఏమిటంటే.. ఈ గ్లింప్స్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించనున్నారు. అట్లీ గత చిత్రం ‘జవాన్’ తో షారుఖ్‌కు భారీ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్నేహంతోనే అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్లకు కింగ్ ఖాన్ మద్దతు తెలపడం విశేషం. ఈ అప్‌డేట్ వినడానికి కొంచెం వింతగా ఉన్నా, అర్ధరాత్రి పూట గ్లింప్స్ విడుదల చేయడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Read also- Peddi Movie : రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన ‘పెద్ది’.. థియేటర్లు బద్దలవ్వాల్సిందే సామి..!

షారుఖ్ ఖాన్ విడుదల చేయనున్నారు!

వర్చువల్ వేడుకలో అల్లు అర్జున్..

ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్, కథానాయికగా ప్రచారంలో ఉన్న దీపికా పదుకొనే, దర్శకుడు అట్లీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో జతకడితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలే అల్లు అర్జున్ సినిమా, ఆపై అట్లీ దర్శకత్వం, దీనికి తోడు షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఇప్పటికే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. గ్లింప్స్ విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కనుందని సమాచారం. టైటిల్ ఏమై ఉంటుందా అనే ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!

వర్చువల్ వేడుకలో ఎవరు పాల్గొంటారు?

Read also- My Village Show : ‘మై విలేజ్ షో ‘ నుంచి తప్పుకున్న అనిల్ జీలా .. ఏం జరిగిందంటే..?

అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. టైటిల్ గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.