
📌 Key Points
- అల్లు అర్జున్-బాసిల్ జోసెఫ్ సినిమాపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- బాసిల్ జోసెఫ్ చిరునవ్వుతో సమాధానం దాటవేయడంతో సినిమాపై సస్పెన్స్ పెరిగింది.
- అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
- బన్నీ ఏడాదికి ఒక సినిమా చేసేందుకు షూటింగ్ సమయంపై కొత్త నిబంధనలు పెట్టారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ‘మిన్నల్ మురళి’ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై బాసిల్ జోసెఫ్ స్పందించారు. ఆయన చిరునవ్వు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
బాసిల్ జోసెఫ్ స్పందన: చిరునవ్వు వెనుక రహస్యం
Basil Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిన్నల్ మురళి వంటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమా చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అట్లీ (Atlee)డైరెక్షన్లో సినిమా ఈ సినిమా అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు ఈ సినిమా అనంతరం బాసిల్ జోసెఫ్ తో సినిమా ఉంటుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.
చిరునవ్వుతో సమాధానం ఇచ్చిన జోసెఫ్…
ఇక అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. అల్లు అర్జున్ తో సినిమా చేయడం గురించి దర్శకుడు బాసిల్ జోసెఫ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు అల్లు అర్జున్ తో సినిమా చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈయన స్పందిస్తూ కేవలం చిరునవ్వుతో సమాధానం దాటవేశారు. ఇలా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆ చిరునవ్వు వెనుక ఏదో భారీ ప్రాజెక్టు రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ రాబోయే ప్రాజెక్ట్స్
ఒకవేళ అల్లు అర్జున్ సినిమా చేయకపోయి ఉంటే కచ్చితంగా అలాంటిది లేదని క్లారిటీ ఇచ్చేవారు కానీ సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో ఈ ప్రశ్నను దాటు వేయడంతో కచ్చితంగా వీరిద్దరీ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది, లోకేష్ కనగారాజ్ సినిమా తరువాతనే ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా(Raaka) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గ్లోబల్ రేంజ్ లో బన్నీ సినిమాలు..
బన్నీ కొత్త షరతులు: వేగంగా సినిమాలు
ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని, ఆగస్టు నుంచి లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక తన సినిమాల విషయంలో అల్లు అర్జున్ ఇటీవల దర్శకులకు కొత్త నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రాజెక్టును కేవలం 200 ల రోజులలో షూటింగ్ పూర్తి చేయాలని ఈయన కండిషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కండిషన్ల ద్వారా అల్లు అర్జున్ పత్రి ఏడాది ఒక సినిమా చేసే వెసులు బాటు ఉంటుందని చెప్పాలి. ఇక బన్నీ నటిస్తున్న సినిమాలన్నీ కూడా గ్లోబల్ రేంజ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
బాసిల్ జోసెఫ్ నవ్వు వెనుక భారీ ప్రాజెక్ట్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్త నిజమైతే అది అల్లు అర్జున్ అభిమానులకు పండగే అవుతుంది.

