
📌 Key Points
- అల్లు అర్జున్ చిన్ననాటి నుంచే నటనలో రాణించారు.
- పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోంది.
- పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా నిలిచారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఆయన సినీ జీవితం, ఆయన సాధించిన విజయాలు గురించి తెలుసుకుందాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
అల్లు అర్జున్ సినీ ప్రస్థానం
HBD Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు ఎదిగారు.. పుష్ప సినిమా వరకు కేవలం ఇండియన్ స్టార్ గానే ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.. ప్రస్తుతం ఈయన తమిళ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు అన్న విషయం అందరికీ తెలుసు. ఈయన బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం..
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. గంగోత్రి మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా అతని లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా మారినా కూడా.. ఆ తర్వాత కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.. పుష్ప మూవీతో అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ లాగా మారాడు. ‘పుష్ప: ది రైజ్’ ఆయన కెరీర్‌నే మార్చేసింది. తగ్గేదే లే అంటూ ఆయన చూపించిన మేకోవర్, మేనరిజమ్స్, గ్లోబల్ స్థాయిలో రికార్డును బ్రేక్ చేసింది..
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు
ఈయన నటించిన పుష్ప మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు పాన్ వరల్డ్ లో రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డుని సృష్టించింది. అంతే కాదు ఈ మూవీకి అతనికి జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని ఏకైక రికార్డు అల్లు అర్జున్ కు దక్కింది.
అట్లీతో అల్లు అర్జున్ కొత్త సినిమా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.. దాదాపు 70 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ తీసుకురావాలి అని మా బిగ్ టీవీ మనసారా కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్..
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. అట్లీతో వస్తున్న సినిమాతో మరోసారి రికార్డులు సృష్టిస్తారని ఆశిద్దాం.


