
📌 Key Points
- అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వైరల్ వార్తలు, ఫ్యాన్స్ లో ఆందోళన.
- రచయిత రత్నకుమార్ పరోక్షంగా ప్రాజెక్ట్ కొనసాగుతుందని హింట్ ఇచ్చారు.
- కమల్ హాసన్ ‘విక్రమ్’ 4 ఏళ్ల సందర్భంగా AA23 కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్.
- సన్ పిక్చర్స్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ మూవీ షూటింగ్ లో బన్నీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాకింగ్ వార్త ఒకటి గుండెల్లో గుబులు రేపింది! లోకేష్ కనగరాజ్ తో ఆయన సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే, ఈ వార్తలపై ఒక క్రేజీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ ఇదే!
బన్నీ నెక్స్ట్ మూవీకి బ్రేకులా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోగా మారిన వారిలో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటారు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమానే రాకా. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా హీరో, క్రేజీ డైరెక్టర్ ప్రాజెక్టు మూలకు పడిందని ప్రచారం చేస్తుండగా.. దాన్ని AA23 తో కొంతమంది లింక్ చేస్తున్నారు. ఈ తరుణంలో రచయిత రత్నకుమార్ పరోక్షంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్-లోకేష్ ప్రాజెక్టు కొనసాగుతుందని హింట్ ఇచ్చారు. కమల్ హాసన్ విక్రమ్ మూవీకి నాలుగేళ్లయిన సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన…AA 23 మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
లోకేష్ ప్రాజెక్ట్ పై రత్నకుమార్ హింట్!
AA23 పై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!
ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరిన్ని అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తో బన్నీ కాంబోపై పూర్తి స్పష్టత త్వరలోనే రానుంది. మరింత సమాచారం కోసం వేచి చూడండి!


