|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం! అమ్మా నిర్ణయంతో ఐకాన్ స్టార్ లైఫ్ టర్నింగ్ పాయింట్!

Published: 14-03-2026, 3:35 AM
అల్లు అర్జున్ సంచలన నిర్ణయం! అమ్మా నిర్ణయంతో ఐకాన్ స్టార్ లైఫ్ టర్నింగ్ పాయింట్!
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, `పుష్ప2`తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్
  • అట్లీతో `ఏఏ22` చిత్రం, సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందుతున్న సినిమా
  • స్నేహితులకు సమానమైన ప్రయారిటీ ఇస్తానని తెలిపిన బన్నీ
  • చిన్నప్పుడు చదువులో వీక్, అమ్మ కేర్ తీసుకుని పాస్ అయ్యేలా చేసిందట

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది! బన్నీ జీవితంలో అతని అమ్మ తీసుకున్న ఒక నిర్ణయం అతని లైఫ్ ని ఎలా మార్చిందో తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అల్లు అర్జున్ జీవితంలో స్నేహం విలువ

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప2` తో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేశారు. ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌ పై కన్నేశారు. అట్లీతో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. సైన్స్ ఫిక్షన్‌ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. 80శాతం ఇది వీఎఫ్‌ఎక్స్ తో కూడిన సినిమా. దీంతో ప్రస్తుతం ఈ సీజీ వర్క్ కి సంబంధించిన షాట్స్ డిజైన్‌ చేస్తున్నారట. ముంబాయిలో ఈ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌ని కొల్లగొట్టాలని ప్లాన్‌ చేస్తున్నారు బన్నీ.

ఈ క్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆయన స్నేహానికి ఇచ్చే ప్రయారిటీ గురించి ఆక్తికర విషయం వెల్లడైంది. అల్లు అర్జున్‌కి ఇండస్ట్రీలో, బయట చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బన్నీవాసు బెస్ట్ ఫ్రెండ్‌. ఆయనతోపాటు చాలా మంది ఉన్నారు. అయితే అల్లు అర్జున్‌ ఏ స్థాయిలో ఉన్నా, స్నేహితులకు మాత్రం సమానమైన ప్రయారిటీ ఇస్తారని, వారిని బాగా చూసుకోవడం, వారిని బాగా మెయింటేన్‌  చేస్తుంటాడట. స్నేహం విషయంలో ప్రాణమిచ్చేలా ఉంటారని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అమ్మ నిర్ణయంతో బన్నీ లైఫ్ టర్నింగ్ పాయింట్

అయితే అల్లు అర్జున్‌ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయన్ని చాలా మార్చేసింది. స్నేహానికి ప్రయారిటీ ఇచ్చేలా చేసిందట. అందుకు కారణం తన అమ్మ అని తెలిపారు అల్లు అర్జున్‌. స్నేహమే కాదు, తన జీవితాన్ని మార్చడంలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెనే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అల్లు అర్జున్‌ చిన్నప్పుడు డల్‌గా ఉండేవాడట. చదువుల్లో వీక్‌గా ఉండేవాడట. దీంతో అమ్మనే కేర్‌ తీసుకుని ఆయన పాస్‌ అయ్యేలా చేసిందట. ఈ క్రమంలో చాలా త్యాగాలు చేసింది. అయితే స్నేహానికి అమ్మ చాలా ప్రయారిటీ ఇచ్చేదని అల్లు అర్జున్‌ తెలిపారు. తన క్లాస్‌ మేట్‌ విషయంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు బన్నీ.

ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారంటే, వారితో తిరిగితే తమ పిల్లలు చెడిపోతారని పేరెంట్స్ భావిస్తారు. కానీ అల్లు అర్జున్‌ అమ్మ మాత్రం స్నేహితులు చాలా ముఖ్యమని చెప్పిందట. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు  క్లాస్‌లో తన పక్కన కూర్చునే అబ్బాయి చాలా సైలెంట్‌గా ఉండేవాడట. హాయ్‌, బాయ్‌కే పరిమితం. ఓ సారి అతను నాలుగైదు రోజులు కాలేజీకి రాలేదట. ఏమైందని ఆరా తీస్తే అతని పేరెంట్స్ చనిపోయారని తెలిసిందట. దీంతో చాలా బాధపడ్డాడట బన్నీ. ఆ తర్వాత ఓ ఇరవై రోజుల తర్వాత ఫ్రెండ్స్ లో కలిసి ఓ హోటల్‌కి వెళితే అందులో తన క్లాస్‌ మేట్‌ కనిపించాడట. ఇక్కడేంటి అని అడిగితే, పేరెంట్స్ లేరు, ఫీజు కట్టలేని, చదువు మానేస్తున్నా అన్నాడట. దీంతో తనకు ఏం చేయాలో తోచలేదట. ఇంటికెళ్లి అమ్మతో ఈ విషయాన్ని చెప్పాడు బన్నీ. దీంతో ఆమె వెంటనే అతని తన ఇంటికి తీసుకురమ్మని చెప్పిందట.

క్లాస్‌మేట్‌తో బన్నీ అనుబంధం వెనుక కథ

అలా తన క్లాస్‌మేట్‌ని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకున్నారట. అతని కాలేజీ ఫీజు కట్టి, అవసరాలన్నీ తనే చూసుకుందట. దాదాపు ఓ ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నాడట. తనతోపాటు కలిసి చదువుకున్నాడట. ఆ సంఘటన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని, స్నేహం విలువ తెలుసుకున్నానని తెలిపాడు అల్లు అర్జున్‌. సినిమా రంగంలోనే కాదు, బయటకు కూడా తనకు మంచి స్నేహితులు ఉన్నట్టు తెలిపారు.

అల్లు అర్జున్ జీవితంలోని ఈ ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.