
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయితే, సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత బన్నీ స్పందించడంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
Key Points
రిషబ్ శెట్టి నటించిన 'కాంతార: చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా ₹818 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అల్లు అర్జున్ 'కాంతార'ను అద్భుతమైన సినిమాగా, రిషబ్ శెట్టిని 'వన్ మ్యాన్ షో'గా అభివర్ణించారు.
రచయిత, దర్శకుడు, నటుడిగా రిషబ్ శెట్టి పనితీరును బన్నీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
అల్లు అర్జున్ ఆలస్యంగా రివ్యూ ఇవ్వడానికి కారణం అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే.
కాంతార కలెక్షన్లు, ప్రముఖుల ప్రశంసలు
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి , నటించిన కాంతార : చాప్టర్ 1(Kantara: Chapter 1) సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది . దసరా కానుకగా అక్టోబర్ 2 న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 818 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది . తెలుగులోనూ ఇప్పటికే రూ . 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది . ఇక ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు . సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా రిషబ్ పై ప్రశంసలు కురిపించారు . తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా కాంతార : చాప్టర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు . ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్వీట్ చేశాడు
అల్లు అర్జున్ రివ్యూ: వన్ మ్యాన్ షో
రిషబ్ .. వన్ మ్యాన్ షో ‘ నిన్న రాత్రి కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను . వావ్ .. ఎంత అద్భుతమైన సినిమా . ఈ మూవీ చూస్తూ నేను ట్రాన్స్ లోకి వెళ్లిపోయా . రచయితగా , డైరెక్టర్ గా , యాక్టర్ గా రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి . ప్రతి క్రాప్ట్ లో ఆయన రాణించారు . రుక్మిణి , జయరామ్ , గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు . టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది . ముఖ్యంగా అజనీష్ సంగీతం , అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ , ధరణి ఆర్ట్ డైరెక్టన్ , అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి . నిర్మాత విజయ్ కిరంగదూర్ , హోంబులే బ్యానర్ కి శుభాకాంక్షలు ’ అని బన్నీ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు .
బన్నీ ఆలస్యానికి కారణం ఇదే!
లేట్ ఎందుకు? కాంతార సినిమా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే . రిలీజ్ అయిన వారం రోజులలోపే సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు . కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్ గా స్పందించాడు . సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓ సినిమాను ఇంత ఆలస్యంగా చూడడానికి గల కారణం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు . అసలు విషయం ఏంటి అంటే .. బన్నీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు . అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ మూవీ కోసం ముంబైలో ఓ భారీ సెట్ కూడా వేశారు . అందులోనూ షూటింగ్ జరుగుతుంది . షూటింగ్ తో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ కాంతార సినిమాను చూడలేకపోయాడు అట . ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమా చూసి .. వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు .
కాంతార భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆలస్యంగా స్పందించినప్పటికీ, ఆయన ప్రశంసలు సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి.


