
📌 Key Points
- ప్రభాస్ ‘స్పిరిట్’లో నటి నదియా కీలక పాత్రలో నటించబోతుంది.
- ‘మిర్చి’ తర్వాత ప్రభాస్, నదియా హిట్ కాంబో రిపీట్.
- నదియా క్యారివ్యాన్ వీడియో వైరల్.. ఫ్యాన్స్‌లో భారీ క్యూరియాసిటీ.
- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే! సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ హై-వోల్టేజ్ ప్రాజెక్ట్‌లో ఒక స్టార్ నటి ఎంట్రీతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
‘స్పిరిట్’లో నదియా సంచలన ఎంట్రీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తు్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. క్రిష్ ఫేమ్ వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ఓ సూపర్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్పిరిట్‌లో నటి నదియా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఆమె షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు నటీనటులకు ఏర్పాటు చేసిన క్యారివ్యాన్‌కు సంబంధించిన దాంట్లో నటి నదియా పేరు మీద క్యారివ్యాన్ రిజర్వ్ చేసి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుండగా.. స్పిరిట్ చిత్రంతో మరోసారి ప్రభాస్‌తో నదియా స్క్రీన్ చేసుకోబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ప్రభాస్, నదియా కాంబోలో ఇప్పటికే ‘మిర్చి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ తల్లి పాత్రలో నదియా నటించగా.. తల్లీకొడుకులుగా ప్రభాస్, నదియా కాంబోకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు వీరిద్దరు స్పిరిట్ కోసం కలిసి వర్క్ చేస్తుండగా.. ఈసారి నదియా ప్రభాస్ పక్కన ఎలాంటి పాత్ర పోషిస్తుందని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.
‘మిర్చి’ కాంబో మళ్ళీ.. ఈసారి ఎలాంటి పాత్ర?
వైరల్ అవుతున్న క్యారివ్యాన్ వీడియో!
ప్రభాస్, నదియా కాంబో మళ్ళీ చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘స్పిరిట్’లో ఆమె పాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఈ సంచలన చిత్రం నుండి మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!


