|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chakda Xpress : వరల్డ్ కప్ గెలిచారు కదా.. ఇప్పటికైనా ఆ సినిమాని రిలీజ్ చేయండి ప్లీజ్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్..

Published: 04-11-2025, 12:16 AM
Chakda Xpress : వరల్డ్ కప్ గెలిచారు కదా.. ఇప్పటికైనా ఆ సినిమాని రిలీజ్ చేయండి ప్లీజ్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్..

భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. ఈ విజయం తర్వాత, క్రికెట్, సినిమా అభిమానులు ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జులన్ గోస్వామి జీవితం ఆధారంగా అనుష్క శర్మ నటించిన ఈ బయోపిక్ విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Key Points

1

భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్‌ 2025 గెలిచింది.

2

జులన్ గోస్వామి బయోపిక్ 'చక్‌దా ఎక్స్‌ప్రెస్'ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

4

వరల్డ్ కప్ గెలుపు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు మార్చే అవకాశం ఉంది.

భారత మహిళా జట్టు వరల్డ్ కప్ విజయం

Chakda Xpress : మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025ని భారత మహిళా జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాని ఓడించి భారత జట్టు విజయం సాధించి సరికొత్త చరిత్ర రాసింది. ఈ గెలుపుతో మహిళల క్రికెట్ కి మరిన్ని మంచి రోజులు రానున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా భారత మహిళా జట్టు వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఓ సినిమాని రిలీజ్ చేయమని క్రికెట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అడుగుతున్నారు.(Chakda Xpress)

క్రికెట్ ఫ్యాన్స్ రిలీజ్ చేయమని అడుగుతున్న సినిమా ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’. మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ చక్‌దా ఎక్స్‌ప్రెస్‌. విరాట్ కోహ్లీ భార్య, అనుష్క శర్మ మెయిన్ లీడ్ లో ఈ బయోపిక్ తెరకెక్కింది. అప్పట్లో వచ్చిన ఈ ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఈ సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లు, పూర్తయి రెండేళ్లు అయినా ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు.

చక్‌దా ఎక్స్‌ప్రెస్ రిలీజ్‌పై ఫ్యాన్స్ డిమాండ్

భారత్ మహిళా జట్టుకి వరల్డ్ కప్ తీసుకురావాలని కొన్నేళ్లుగా పోరాడిన వాళ్లలో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచాక కూడా మహిళా జట్టు కప్పు తీసుకెళ్లి వీళ్ళ ఇద్దరి చేతుల్లోనే పెట్టారు. మిథాలీ, జులన్ ఆ కప్పుని చూసి ఎమోషనల్ అయ్యారు. 20 ఏళ్లు తాము ప్రయత్నించామని కానీ ఇప్పుడు వీళ్ళు సాధించారని భావోద్వేగానికి గురయ్యారు.

అనుష్క శర్మ కంబ్యాక్.. సినిమా ఎప్పుడు?

అందుకే ఇలాంటి మంచి సమయంలో ఇప్పుడైనా జులన్ గోస్వామి బయోపిక్ చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ సినిమాని రిలీజ్ చేయాలని కోరుతున్నారు. పైగా ఈ సినిమా అనుష్క శర్మ కి కంబ్యాక్ సినిమా కూడా. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఇప్పుడైనా రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. ఆ సినిమాలో జులన్ గోస్వామి వరల్డ్ కప్ గెలవకుండానే రిటైర్మెంట్ ప్రకటించేసినట్టే ఉంటుంది. ఇప్పుడు తమ తర్వాత టీమ్ వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి ఇంకొన్ని సీన్స్ షూట్ చేసి రిలీజ్ చేస్తారేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ సినిమా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.

భారత మహిళా జట్టు గెలుపుతో ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ విడుదలపై ఉత్సాహం పెరిగింది. అనుష్క శర్మ అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అద్భుతమైన సమయంలో నిర్మాతలు సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.