|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun : పుష్ప సాంగ్ కి అమెరికా టాలెంట్ షోలో అదిరిపోయే పర్ఫార్మెన్స్.. స్పందించిన అల్లు అర్జున్..

Published: 04-08-2025, 4:14 AM
Allu Arjun : పుష్ప సాంగ్ కి అమెరికా టాలెంట్ షోలో అదిరిపోయే పర్ఫార్మెన్స్.. స్పందించిన అల్లు అర్జున్..

ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా పాటలకు అభిమానుల ఆదరణ ఎక్కువగా ఉంది. తాజాగా అమెరికా గాట్ టాలెంట్ షోలో B Unique Crew చేసిన పుష్ప సాంగ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు అల్లు అర్జున్ స్పందించాడు.

Key Points

1

అమెరికా గాట్ టాలెంట్ షోలో B Unique Crew అద్భుతమైన ప్రదర్శన

2

పుష్ప సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ కి అమెరికాలో అభిమానుల ఆదరణ

4

అల్లు అర్జున్ వీడియోను చూసి ‘అద్భుతం’ అని స్పందించాడు

అమెరికా గాట్ టాలెంట్ లో పుష్ప సాంగ్ ప్రదర్శన

Allu Arjun : పుష్ప సినిమాకు, ఆ సినిమా సాంగ్స్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమ్ వచ్చిన సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లో పుష్ప సాంగ్స్ కి రీల్స్, వీడియోలు చేసారు. అయితే తాజాగా అమెరికా గాట్ ట్యాలెంట్ షోలో B Unique Crew పుష్పలో దాక్కో దాక్కో మేక సాంగ్, మ్యూజిక్ కి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అమెరికా ఘాట్ ట్యాలెంట్ షోలో ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ ట్యాలెంట్స్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ ట్యాలెంట్ ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇండియా జోధ్ పూర్ కి చెందిన B Unique Crew టీమ్ పుష్ప సాంగ్ కి జిమ్నాస్టిక్స్ తో డ్యాన్స్ తో పాటు కొంత క్రియేటివిటీ, టెక్నాలజీ వాడి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలా ఇంటర్నేషనల్ స్టేజిపై పుష్ప సాంగ్ కి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

B Unique Crew యొక్క అద్భుతమైన ప్రతిభ

Also See : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొడుకు ఫోటోలు చూశారా? తిరుమలలో తనయుడికి పేరు పెట్టిన కిరణ్..

ఈ వీడియో పుష్ప సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో అల్లు అర్జున్ అద్భుతం, మైండ్ బ్లోయింగ్ అంటూ ఈ వీడియోకి స్పందించాడు. మీరు కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్న వీడియో చూసేయండి..

అల్లు అర్జున్ స్పందన

B Unique Crew యొక్క ప్రతిభ అల్లు అర్జున్ ను మెప్పించింది. పుష్ప సాంగ్ యొక్క ప్రజాదరణను ఇది మరింత పెంచింది. అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.