|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ ‘రాకా’లో మృణాళ్ మెరుపు? నిజమెంత? వేచి చూడాల్సిందే!

Published: 10-04-2026, 1:35 PM
అల్లు అర్జున్ 'రాకా'లో మృణాళ్ మెరుపు? నిజమెంత? వేచి చూడాల్సిందే!
  • మృణాళ్ ఠాకూర్ త్వరలో అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
  • అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ సినిమాలో మృణాళ్ నటించే అవకాశం ఉంది.
  • దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
  • అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.

మృణాళ్ ఠాకూర్ త్వరలో అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం ఉంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలో ఆమె కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్‌తో మృణాళ్ సినిమా?

Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ పరిచయం అవసరం లేనిపేరు సౌత్ సినిమాలతో పాటు నార్త్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటించిన డెకాయిట్(Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె పలు ప్రాంతాలకు వెళ్తూ సందడి చేస్తున్నారు అలాగే పలు థియేటర్లలో అభిమానులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృణాళ్ ఠాకూర్ తాజాగా అల్లు అర్జున్ తో సినిమా గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారా అని ప్రశ్నలు అభిమానుల నుంచి ఎదురు అయ్యాయి దీంతో ఈమె మాట్లాడుతూ అల్లు అర్జున్ గారితో సినిమా చేసే అవకాశం త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను అందుకోసం ప్రార్థనలు కూడా చేస్తున్నాను అంటూ ఈమె మాట్లాడడంతో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది.మృణాళ్ ఠాకూర్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాకా సినిమాలో నటిస్తున్నారని అయితే ఈ విషయాన్ని ఈమె రహస్యంగా ఉంచారని తెలుస్తోంది. చిత్ర బృందం ఈమె పాత్రకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేయబోతున్నారని అప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడ లీక్ చేయకుండా రహస్యంగా ఉంచారని భావిస్తున్నారు.

‘రాకా’లో హీరోయిన్‌గా దీపికా పదుకొనే

గత కొంతకాలంగా ఈమె అల్లు అర్జున్ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం ఎక్కడ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల అల్లు అర్జున్ సైతం మనిద్దరం కలిసి సినిమా చేస్తామని ఆశిస్తున్నాను అంటూ మృణాళ్ ఒక గిఫ్ట్ పంపించడంతో బన్నీ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ చేసే వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మృణాళ్ ఠాకూర్ రాకా సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.

అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్ పోస్టర్..

సినిమాపై అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్

ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి చిన్న విషయాలు బయటకు రాకుండా చిత్ర బృందం ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు .దీపిక పదుకొనే హీరోయిన్గా నటించబోతున్నారు అంటూ అధికారకంగా ప్రకటించారు. త్వరలోనే మృణాళ్ ఠాకూర్ కు సంబంధించిన విషయాన్ని కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కాస్త సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది.

మొత్తానికి మృణాళ్ ఠాకూర్ ‘రాకా’ సినిమాలో నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.