|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రేకింగ్: అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ విజయం! ఇకపై ఆయన అనుమతి లేకుండా…

Published: 17-04-2026, 6:35 AM
బ్రేకింగ్: అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ విజయం! ఇకపై ఆయన అనుమతి లేకుండా...
  • అల్లు అర్జున్ వ్యక్తిగత హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది.
  • అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరు, వాయిస్, ఫోటోలు వాడకూడదని కోర్టు తెలిపింది.
  • డీప్ ఫేక్, AI టెక్నాలజీతో మార్ఫింగ్ చేయడం బ్రాండ్ విలువను దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది.
  • సెలబ్రిటీల పేర్లను వాడుకొని తప్పుదోవ పట్టిస్తున్న వారిలో మార్పు వస్తుందా అనే సందేహాలు ఉన్నాయి.

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్‌కు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు

Allu Arjun:టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతోమంది పేరు మోసిన సెలబ్రిటీల పేర్లను, వాయిస్ ను, వీడియోలను, ఫోటోలను ఉపయోగించుకొని కొంతమంది వాణిజ్యపరంగా ఆదాయం పొందుతున్నారు.. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత హక్కుల కోసం పోరాడుతూ సినిమా సెలబ్రిటీలు, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ స్టే తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది అధునాతన టెక్నాలజీ ఏఐని ఉపయోగించి తన వాయిస్ ను, ఫోటోలను, పేరుని అలాగే వీడియోలను కూడా ఉపయోగించుకుంటున్నారు అని ఇలాంటి వాటి నుంచి వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి అని కోరుతూ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇకపోతే సెలబ్రిటీల పాపులారిటీని అడ్డం పెట్టుకొని ప్రత్యేకించి కొన్ని సంస్థలు.. వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇలా చేయడం వల్ల సెలబ్రిటీల యొక్క వ్యక్తిగత బ్రాండ్ విలువ దెబ్బతింటుంది . పైగా వారి ప్రమేయం లేని విషయాలలో వారి పేరు వినిపించడం సెలబ్రిటీలకు ఇబ్బందులుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్.. జస్టిస్ తుషార్ రావు గెడెల నేతృత్వంలోనే ధర్మాసనం ఇవాళ విచారించింది.

వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు కోర్టు ఆదేశాలు

తన అనుమతి లేకుండా ఏఐ ఉపయోగించి వాయిస్, ఫోటోలు , పేర్లు, వీడియోలు ఉపయోగించుకుంటున్నారని, దీని నుంచి రక్షణ కావాలి అని ఆయన కోరగా..అల్లు అర్జున్ వేసిన సివిల్ సూట్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి భారీ ఊరట కలిగించింది. అల్లు అర్జున్ వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ ఇచ్చిన కీలక ఉత్తర్వులు ఆయనకు భారీ ఊరట కలిగించాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫోటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు ముఖ్యంగా డీప్ ఫేక్ , ఏ ఐ టెక్నాలజీ తో ఫోటోలను మార్ఫింగ్ చేయడం, వాయిస్ క్లోనింగ్ చేయడం వంటి చర్యలు బ్రాండ్ విలువలను దెబ్బతీస్తాయని కోర్టు తెలిపింది . ప్రస్తుతం కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

AI టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు

ఇకపోతే అంతా బాగానే ఉన్నా కనీసం ఇకనైనా సెలబ్రిటీల పేర్లను వాడుకొని తప్పుదోవ పట్టిస్తున్న వారిలో మార్పు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకోవడానికి హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. మరి ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ కూడా తన వ్యక్తిగత హక్కులను కాపాడుకుంటూ స్టే దక్కించుకున్నారు. మరి ఇప్పటికైనా కొంతమంది ఆకతాయిలలో మార్పు రావాలి అని అనుమతి లేకుండా ఎవరి ఫోటోలను, వాయిస్ ను ఎక్కడ ఉపయోగించకూడదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి అల్లు అర్జున్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా ఈ తీర్పు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.