|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ నిజం బయటపెట్టిన బన్నీ! స్నేహారెడ్డితో పెళ్ళి ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా? వైరల్ న్యూస్!

Published: 25-03-2026, 1:35 AM
షాకింగ్ నిజం బయటపెట్టిన బన్నీ! స్నేహారెడ్డితో పెళ్ళి ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా? వైరల్ న్యూస్!
  • స్నేహారెడ్డితో తనది పెద్దలు కుదిర్చిన వివాహమని స్పష్టం చేసిన అల్లు అర్జున్.
  • తమ అభిరుచులు కలిశాయని, స్నేహితులు పెళ్లి చేసుకోవాలని సూచించారని బన్నీ వెల్లడి.
  • సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ముందే అనుకున్నట్లు బన్నీ తెలిపాడు.
  • కొన్నేళ్ల క్రితం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్న అల్లు అర్జున్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వివాహం గురించి ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. స్నేహారెడ్డితో ఆయన వివాహం ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

ప్రేమ పెళ్లి గురించి బన్నీ అసలు నిజం

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప 2`తో ఆయన ఇమేజ్‌ పాన్‌ ఇండియా దాటిపోయింది. ఇప్పుడు గ్లోబల్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ఆయన `ఏఏ 22` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ ఇటీవల తన 15వ మ్యారేజ్‌ యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. స్నేహారెడ్డిని ఆయన 2011 మార్చి 6న వివాహం చేసుకున్నారు.  వీరిద్దరు మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. అయితే వీరిది ప్రేమ పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి.

అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనే వార్తలు అడపాదడపా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు అంత క్లోజ్‌గా ఉంటారు. దీంతో బన్నీది లవ్‌ మ్యారేజ్‌ అనే కామెంట్స్ వచ్చాయి. ఈ విషయం ఆయన వరకు వెళ్లింది. దీంతో బన్నీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు రావడానికి కారణమేంటో తెలిపారు. తమది నిజంగానే లవ్‌ మ్యారేజా? అరెంజ్‌ మ్యారేజా అనే విషయాన్ని అల్లు అర్జున్‌ చెప్పాడు. ఈ క్రమంలో  ఎవరికీ తెలియని విషయాలను ఆయన బయటపెట్టాడు.

స్నేహారెడ్డితో బంధం ఎలా మొదలైందో చెప్పిన బన్నీ

`మాది ప్రేమ పెళ్లి అనుకుంటారు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లినే` అని స్పష్టం చేశారు అల్లు అర్జున్‌. స్నేహ తనకు మంచి స్నేహితురాలు అని, తమ ఇద్దరి అభిరుచులు కలిశాయని, `మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది` అని తన ఫ్రెండ్స్ చెప్పారని,  ఆ తర్వాత తాను కూడా ఆ దిశగా ఆలోచించినట్టు చెప్పాడు అల్లు అర్జున్‌. ఆ తర్వాత మూడు నెలలు గడిచాక ఇంట్లో వాళ్లు ఏకంగా పెళ్లి సంబంధమే చూశారట. ఈ సంబంధాన్ని ఫిక్స్ చేసినట్టు తెలిపాడు బన్నీ.

ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని చెప్పాడు అల్లు అర్జున్‌. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ముందే అనుకున్నాడట. అయితే దానికి ప్రత్యేక కారణం ఏం లేదన్నాడు. మన ఆలోచన దృక్పథం ఇంకాస్త విస్తృతమవ్వడానికి మరో రంగానికి చెందిన వాళ్లతో కలిసి ఉంటే మంచిదని, స్నేహకు సినిమాల గురించి పెద్దగా తెలియదని, తమ ఇద్దరి మైండ్‌ సెట్‌ వేరు అని, భిన్న ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటారు. అలా తమ బంధం మరింత బలపడిపోయిందని చెప్పాడు బన్నీ. కొన్నేళ్ల క్రితం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ ఈ విషయాలను పంచుకున్నారు.

ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదనుకున్న బన్నీ

అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకోగా, వీరికి కొడుకు అయాన్‌, కూతురు అర్హ జన్మించారు. అల్లు స్నేహారెడ్డి పొలిటికల్‌ ఫ్యామిలీ. నాన్న కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి వ్యాపారవేత్త. రాజకీయనాయకుడు. విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అల్లు స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడున్నస్టార్స్ హీరోల భార్యల్లో అత్యంత యాక్టివ్‌గా ఉన్నది స్నేహారెడ్డినే. ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యూలర్‌ గా పోస్ట్ లు పెడుతుంది. ఫిట్‌నెస్‌ వీడియోలు, షాపింగ్‌ వీడియోలు, తమ పిల్లల వీడియోలు పంచుకుంటుంది. కొత్త కొత్తవి ఎక్స్ ఫ్లోర్‌ చేస్తుంటుంది.

అల్లు అర్జున్ తన పెళ్లి గురించి చెప్పిన ఈ విషయాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.