|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: “ధురంధర్” ఒక అద్భుతం.. రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

Published: 12-12-2025, 7:08 AM
Allu Arjun: “ధురంధర్” ఒక అద్భుతం.. రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్
  • రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది.
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ధురంధర్’ చూసి సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు.
  • రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ నటనను అల్లు అర్జున్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
  • అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు.

బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రివ్యూ ఇచ్చారు. రణవీర్ సింగ్ నటన, సాంకేతికత అద్భుతమని ప్రశంసించారు. “ధురంధర్” ఒక బ్లాక్ బస్టర్ అని, అందరూ తప్పకుండా చూడాలని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

‘ధురంధర్’ బాక్స్ ఆఫీస్ ప్రస్థానం

Allu Arjun: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. URI సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మరోసారి దేశభక్తి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత కొంతకాలంగా హిట్స్ కోసం చేస్తున్న రణవీర్ సింగ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది. దీంతో, బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా చూడటం కోసం క్యూ కడుతున్నారు. మంచి అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు రూ.7 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఏడు రోజులకు గాను రూ.27 కోట్లు కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Prabhas: రెబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్.. ఫ్యాన్స్ కి పండగే..

అల్లు అర్జున్ ప్రశంసలు: “ధురంధర్” ఒక అద్భుతం

అయితే, ధురంధర్ సినిమాను తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చూశారు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడే ‘ధురంధర్’ మూవీ చూడటం జరిగింది. బెస్ట్ యాక్టింగ్, అద్భుతమైన సాంకేతికత, ఎక్సలెంట్ సౌండ్‌ట్రాక్‌ తో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. నా బ్రదర్ రణ్‌వీర్ సింగ్ తన న‌ట‌న‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. అక్షయ్ ఖన్నా రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో నటించేలేదు జీవించారు. సారా అర్జున్ న‌ట‌న కూడా బాగుంది. ఇంత మంచి సినిమాను నిర్మించిన జ్యోతి దేశ్‌పాండే, జియో స్టూడియోస్‌కు నా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మరీ ముఖ్యంగా కెప్టెన్‌, బెస్ట్ ఫిల్మ్ మేకర్ ఆదిత్య ధర్ గారికి. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అందరూ తప్పకుండా చూడండి” అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ తదుపరి భారీ ప్రాజెక్ట్

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్ రివ్యూ ‘ధురంధర్’ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ ప్రశంసలు సినిమా విజయాన్ని మరింత పెంచాయి. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.