|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్ళే వద్దన్న విజయ్.. రష్మికతో డెస్టినేషన్ వెడ్డింగ్ వెనుక అసలు కథ ఇదేనా?

Published: 24-03-2026, 2:05 AM
షాకింగ్: పెళ్ళే వద్దన్న విజయ్.. రష్మికతో డెస్టినేషన్ వెడ్డింగ్ వెనుక అసలు కథ ఇదేనా?
  • విజయ్, రష్మికల డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియో వైరల్! అభిమానులకు పండుగే.
  • విజయ్ మనసు మార్చిన రష్మిక ప్రేమ.. స్వయంగా వెల్లడించిన మేనమామ యష్ రంగినేని.
  • అమ్మమ్మ సమాధిని సందర్శించిన విజయ్ దేవరకొండ, రష్మిక జోడి!
  • విజయ్, రష్మిక పెళ్లిలో సందడి చేసిన యష్ రంగినేని.. ప్రత్యేక వీడియో రిలీజ్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి ఒక సంచలన వార్త! విజయ్ మేనమామ యష్ రంగినేని స్వయంగా ఈ జంట గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

రష్మికతో విజయ్ ప్రేమాయణం.. అసలు నిజాలు!

విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకను అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. వారు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చాలా తక్కువ మంది అతిధుల మధ్యలో అంగరంగ వైభవంగా చిరకాలం గుర్తుండిపోయేలా వివాహమాడారు. ఆ వివాహంలో విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా ఎక్కువ కనిపించారు. ఆయన కూడా ఒక నటుడే. అంతేకాదు విజయ్ దేవరకొండ సినిమా పెళ్లిచూపులు సినిమాకు నిర్మాతగా కూడా పనిచేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో విజయ్ దేవరకొండకు సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. విజయ్ సినిమా ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు పెళ్లి అవసరమా? ఇప్పుడు కెరీర్ చూసుకోవడం బెటర్, ఈ ఫీల్డ్ లో పెళ్లెందుకు అని అనేవాడని చెప్పారు. కానీ రష్మిక పరిచయం అయ్యాక ఆ అభిప్రాయం కొన్నాళ్లకు మారిందని చెప్పారు. వాళ్ళిద్దరి కాంబినేషన్, కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారని చెప్పారు. వాళ్ళిద్దరిని చూసి మాకు చాలా ఆనందం వేసిందని ఆయన వివరించారు.

పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందని.. ఆ పెళ్లి అంత గ్రాండ్ గా జరగడానికి విజయ్ దేవరకొండ, రష్మిక, అలాగే తన చెల్లి అంటే విజయ్ దేవరకొండ తల్లి మాధవి కూడా కారణమని తెలియజేశారు. ఆ పెళ్లిని చాలా జాగ్రత్తగా తన చెల్లి దగ్గరుండి చేసిందని, ఎంతో సంతోషంగా ఆ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయించిందని వివరించారు. అక్కడ పెళ్లి ప్లానింగ్ అంతా వాళ్ళ ముగ్గురే చేశారని, అది పెళ్లిలా కాకుండా ఒక విహార యాత్రలా ప్లాన్ చేశారని తెలియజేశారు. వచ్చిన అతిథులకు చాలా తక్కువ మందే అయినా ప్రతి రోజు ఆటలు పాటలు ఉండేవని.. అందుకే మేము ఒక హాలిడేస్ లో ఎంజాయ్ చేసినట్టు పెళ్లిని ఎంజాయ్ చేసామని చెప్పారు యష్ రంగినేని.

డెస్టినేషన్ వెడ్డింగ్‌లో గ్రాండ్ సెలెబ్రేషన్స్!

విజయ్ కు తన అమ్మమ్మ అంటే ఎంతో ప్రేమని చెప్పారు యష్ రంగినేని. తన తల్లి (విజయ్ అమ్మమ్మ) బతికున్నప్పుడు విజయ్ సినిమాల్లోకి వెళ్తానంటే ఎంతో కంగారు పడేవారని, విజయ్ తండ్రి సక్సెస్ కాలేదు కాబట్టి విజయ్ కూడా సినిమాల్లోకి వెళ్లడం ఎందుకని భయపడే వారిని చెప్పారు. కానీ విజయ్ సక్సెస్ ని చూడకముందే తన తల్లి 2012లో చనిపోయారని చెప్పారు. విజయ్ కు తన అమ్మమ్మ అంటే ఎంతో ప్రేమ అని పెళ్లయ్యాక ఆమె సమాధిని భార్యతో కలిసి దర్శించుకున్నాడని వివరించారు.

అమ్మమ్మతో విజయ్ అనుబంధం.. ఎమోషనల్ స్టోరీ!

రష్మిక, విజయ్ దేవరకొండ హఠాత్తుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోలేదని.. వాళ్ళు చాలా కాలం పాటు స్నేహితులుగా కొనసాగారని, ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని చెప్పారు. రష్మిక తన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా కూడా అంతా ఆనందంగా కనిపించలేదని.. కానీ పెళ్లిలో ఎంతో సంతోషంగా ఎనర్జిటిక్ గా ఉందని వివరించారు. రష్మిక బాలీవుడ్ లో సక్సెస్ అవ్వడానికి వెనుక విజయ్ గైడెన్స్ కూడా ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని రిసెప్షన్ కు పిలిచేందుకు విజయ్ మొదట వెళ్లారని, ఆ తర్వాత విజయ్ తల్లి వెళ్లారని వివరించారు. ఇక రష్మిక తన సైడు నుంచి కూడా పిలిచేందుకు తాను కూడా ఒంటరిగానే వెళ్లి వచ్చిందని చెప్పారు. ఇక మిగతా రాజకీయ నాయకులందర్నీ పిలిచేందుకు మేనమామగా ఆ బాధ్యత తానే తీసుకున్నానని వివరించారు.

విజయ్, రష్మికల పెళ్లికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో మీ ముందుకు వస్తాయి. అప్పటివరకు చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.