
📌 Key Points
- అల్లు శిరీష్, నైనికల వివాహం అల్లు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది.
- మెగా కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- అల్లు అర్జున్ తన కుటుంబంతో ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహం నైనిక రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
అల్లు శిరీష్ నైనికల వివాహం
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా పూర్తి అయ్యాయి. అల్లు శిరీష్ నైనికల వివాహం గత రాత్రి అల్లు స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొని సందడి చేశారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇలా అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహపు వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ప్రస్తుతం అల్లు శిరీష్ కు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా పూర్తి కావడంతో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యుల ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కొత్తజంటతో పాటు అల్లు అర్జున్ దంపతులు అల్లు అరవింద్ దంపతులు కలిసి దిగిన ఈ ఫోటోని షేర్ చేస్తూ..
నా తమ్ముడు అల్లు శిరీష్, నైనిక రెడ్డి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంలో వారిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లు కుటుంబంలోకి నైనికకు స్వాగతం. తన తమ్ముడు పెళ్లి సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరాభిమానాలకు మా ఫ్యామిలీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అంటూ అల్లు అర్జున్ తన తమ్ముడి పెళ్లి గురించి అలాగే కొత్త జంటను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు కూడా పూర్తి కావడంతో బన్నీ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.
వేడుకకు హాజరైన ప్రముఖులు
Wishing a happy married life to my brother @AlluSirish & #Nayanika . Welcome to the Allu family . I also thank everyone for sending your warm wishes and blessings. We are always grateful for the love. ALLU FAMILY. pic.twitter.com/enEjs7D68y
— Allu Arjun (@alluarjun) March 7, 2026
అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
పుష్ప 2 సినిమా తరువాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం.. ఇలా ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా దీపికా పదుకొనే నటిస్తున్నారు.. అలాగే మరో నటి మృణాళ్ ఠాకూర్ కూడా భాగం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు.
అల్లు శిరీష్ వివాహం ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ వైరల్ అయింది. బన్నీ త్వరలో పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొననున్నారు.


