
📌 Key Points
- చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్
- చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా అంటే బన్నీకి ఎంతో ఇష్టం.. ఎన్నోసార్లు చూశారట!
- చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు మూవీని రీమేక్ చేయాలనీ ఉందని బన్నీ తెలిపాడు
- చిరంజీవి డాన్సులు స్వయంగా బన్నీకి నేర్పించారట.. ఆ వీడియోలు ఒకప్పుడు వైరల్ అయ్యాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన చిరంజీవిగారి సినిమాలను ఎంతో అభిమానిస్తారు. బన్నీకి ఇష్టమైన చిరంజీవి సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. తనని తాను షైన్ చేసుకున్నారు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు. `పుష్ప 2`తో ఆయన రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. నెక్ట్స్ గ్లోబల్ ఇమేజ్‌పై, అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేశారు. తన భారీ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్.. అన్నీ విషయాల్లో చిరంజీవిని ఇన్‌స్పైర్ అయ్యాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డాన్సులు స్వయంగా చిరంజీవినే నేర్పించారు. ఖాళీ సమయంలో చరణ్, బన్నీ, తేజ్, వరుణ్ ఇలా అందరితో డాన్స్ చేయించారు చిరు. ఆయా వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు `వితేజ` సినిమాలో బాలనటుడిగా బన్నీని వెండితెరకు పరిచయం చేయించారు. మరోవైపు `డాడి`లోనూ డాన్సర్‌గా చిన్న పాత్రలో అల్లు అర్జున్ కనిపించిన విషయం తెలిసింది.
బన్నీకి ఇష్టమైన చిరు సినిమా ఏంటో తెలుసా?
మరి అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? స్వయంగా బన్నీనే ఈ విషయాన్ని పంచుకున్నారు. ఎన్నిసార్లు అయినా చూడదగ్గ చిత్రాల్లో చిరంజీవి నటించిన `ఇంద్ర` సినిమా అని చెప్పారు. హాలీవుడ్‌లో `టైటానిక్`, తెలుగులో `ఇంద్ర` సినిమా అని తెలిపారు. ఈ మూవీ ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుందని, ఏదో ఒక కొత్త ఫీలింగ్‌ని కలిగిస్తుందని చెప్పారు. ఎప్పుడూ చూసినా ఇంతకు ముందు గమనించని కొత్త విషయం కనిపిస్తుందని చెప్పారు. ఈ మూవీని ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదని ఆయన వెల్లడించారు. `రుద్రమదేవి` సినిమా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక మరో సందర్బంలో చిరంజీవి నటించిన చిత్రాల్లో తనకు ఇష్టమైన మూవీ `రౌడీ అల్లుడు` అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాను రీమేక్ చేయాల్సి వస్తే ఈ మూవీని రీమేక్ చేస్తానని ఆయన తెలిపారు. ఆ సినిమాలో చిరంజీవి గారి పీక్ లెవల్ చూస్తారని, కామెడీ వేరే లెవల్ అని తెలిపారు. నటుడిగా ఆయన బౌండరీస్ బ్రేక్ చేసి నటించిన చిత్రం అని, అత్యధికంగా తాను చూసి మూవీ అని, అందులో చిరంజీవిగారి బాడీలాంగ్వేజ్‌ని పీక్‌లో చూస్తారని తెలిపారు. `రౌడీ అల్లుడు` తన ఫేవరేట్ మూవీ అని, రీమేక్ చేయాల్సి వస్తే ఈ సినిమాని రీమేక్ చేస్తానని తెలిపారు బన్నీ. సినిమా ప్రారంభం సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్, ప్రతి డైలాగ్ చెప్పేయగలను అని తెలిపారు.
రౌడీ అల్లుడు గురించి బన్నీ కామెంట్స్ వైరల్
`గంగోత్రి` సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. `ఆర్య`తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హీరోగా తొలి బ్రేక్ అందుకున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత `బన్నీ`, `దేశముదురు`, `జులాయి`, `రేసుగుర్రం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `వేదం`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. స్టార్‌గా ఎదిగారు. `పుష్ప 2` తర్వాత ఆయన రేంజ్ ఏంటో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన అట్లీ ద్శకత్వంలో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది.
చిరంజీవి గారి సినిమాలంటే బన్నీకి ఎంతో అభిమానం. ముఖ్యంగా ఇంద్ర సినిమా అంటే చాలా ఇష్టం అని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


