|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లికి ముందే రచ్చ: ‘వావ్’ మ్యాగజైన్‌పై అల్లు శిరీష్, నైనిక! వైరల్ ఫోటోలు చూశారా?

Published: 02-02-2026, 3:35 AM
పెళ్లికి ముందే రచ్చ: 'వావ్' మ్యాగజైన్‌పై అల్లు శిరీష్, నైనిక! వైరల్ ఫోటోలు చూశారా?
  • అల్లు శిరీష్, నైనిక రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది.
  • దుబాయ్‌లో స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్న అల్లు శిరీష్.
  • ‘వావ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై అల్లు శిరీష్, నైనిక ఫోటోలు.
  • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్.

అల్లు శిరీష్, నైనిక రెడ్డి త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మార్చి 6న వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా, ఈ జంట ‘వావ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై మెరిసింది. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్చి 6న అల్లు శిరీష్, నైనిక వివాహం

Allu Sirish Nainika: అల్లు శిరీష్ పరిచయం అవసరం లేని పేరు. అల్లు అరవింద్ కుమారుడిగా అల్లు శిరీష్ (Allu Sirish)అందరికీ సుపరిచితమే. ఇక ఈయన గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అల్లు శిరీష్ తన కెరియర్ లో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈయన మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. అల్లు శిరీష్ చివరిగా 2024వ సంవత్సరంలో బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇలా వరుసగా సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న నేపథ్యంలో అల్లు శిరీష్ చిన్న గ్యాప్ ఇచ్చారు.

ఇక అల్లు శిరీష్ వృత్తిపరమైన విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.. అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈయన నైనిక రెడ్డి(Nainika Reddy) అనే అమ్మాయితో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలు ఉంటున్నారు ఇలా వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహపు వేడుకలు మార్చి ఆరో తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇలా పెళ్లి తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో అల్లు శిరీష్ తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయిలో ఘనంగా బ్యాచిలర్ పార్టీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్న అల్లు శిరీష్

ఇలా మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంట ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ పై రావటం విశేషం. వావ్ మ్యాగజిన్ హైదరాబాద్(Wow Magazine Hyderabad ) కవర్ పేజి పై కాబోయే దర్శనమిచ్చారు.. ఇలా అల్లు శిరీష నైనిక ఫోటోలను కవర్ పేజీ పై ప్రచురిస్తూ.. ఫిబ్రవరి వచ్చేసింది వావ్ పత్రిక ప్రేమ సంబంధాల ప్రత్యేక సంచిక కూడా వచ్చేసిందని తెలిపారు. అల్లు శిరీష్, నైనిక ప్రేమ కథను మాకు తెలియచేయడం కోసం తన కాబోయే భార్య నైనికతో మా కవర్ పై ఉన్నారు వీటితోపాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు అంటూ వావ్ మ్యాగజైన్ హైదరాబాద్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

‘వావ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై కాబోయే దంపతులు

ఇక ఇదే ఫోటోలను అల్లు శిరీష్ షేర్ చేస్తూ.. మై ఫస్ట్ కవర్ విత్ నైనిక అంటూ  శిరీష్ సైతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు శిరీష్ నైనిక ప్రస్తుతం పెళ్లి పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.వీరి వివాహం ఫిబ్రవరి 6వ తేదీ అని ప్రకటించినప్పటికీ పెళ్లి ఎక్కడ ఏంటి అనే విషయాలను మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు త్వరలోనే పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఇక నైనిక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయని తెలుస్తోంది.

అల్లు శిరీష్, నైనిక రెడ్డిల జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వారి పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.