|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’: పహిల్వాన్‌గా విశ్వరూపం! గ్లింప్స్ చూస్తే షాక్!

Published: 27-03-2026, 1:05 AM
రామ్ చరణ్ 'పెద్ది': పహిల్వాన్‌గా విశ్వరూపం! గ్లింప్స్ చూస్తే షాక్!
  • రామ్ చరణ్ కెరీర్‌లోనే తొలిసారిగా రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు.
  • ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
  • గ్లింప్స్‌లో రామ్ చరణ్ మేకోవర్, లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
  • ఏప్రిల్ 30, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్‌లో ఆయన పహిల్వాన్‌గా కనిపించనున్నారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రామ్ చరణ్ పహిల్వాన్ గ్లింప్స్ విడుదల

Peddi Glimpse: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ పహిల్వాన్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉంది. వీడియో చూస్తుంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ ఒక రెజ్లర్ (పెహిల్వాన్) పాత్రలో అదరగొట్టారు. ఇంతకు ముందు వచ్చిన ప్రచార చిత్రాల్లో క్రికెట్ ఆటగాడిగా కనిపించారు. ఇప్పుడు పహిల్వాన్ గా కనిపించారు.  ఆయన బాడీ మేకోవర్, గుబురు గడ్డం, పవర్ ఫుల్ లుక్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా కుస్తీ పోటీల కోసం ఆయన చేస్తున్న కఠినమైన శిక్షణ, ప్రత్యర్థులతో తలపడే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ‘పెద్ది’

Read also- Ram Charan: రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, విడుదల తేదీ వివరాలు

వీడియోలో వినిపించే “కుస్తీ అంటే బంతితో బ్యాట్ కెదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకెదురెళ్లే ఆట” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కలగలిపి ఈ చిత్రాన్ని ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. గ్లింప్స్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 30, 2026 దేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏప్రిల్ 30, 2026న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.