
📌 Key Points
- నయనక రెడ్డితో ఏడడుగులు వేసిన అల్లు శిరీష్
- పెళ్లికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి
- వైరల్ అవుతున్న అల్లు శిరీష్ పెళ్లి ఫోటోలు
- రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత వివాహ బంధంలోకి అల్లు శిరీష్
సినీ నటుడు అల్లు శిరీష్, నయనక రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంగరంగ వైభవంగా అల్లు శిరీష్ వివాహం
Allu Sirish -Nayanika Reddy: పెసినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఏకంగా రెండు జంటలు పెళ్లి చేసుకుని అభిమానులకు శుభవార్త తెలిపాయి. అలా ఫిబ్రవరి 26 2026న రష్మిక మందన్న( Rashmika mandanna), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) 8 సంవత్సరాల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక నిన్న అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish)తాను ప్రేమించిన నయనిక రెడ్డి(Nayanika Reddy) తో ఏడడుగులు వేసి కొత్త బంధంలోకి ప్రవేశించారు. హైదరాబాదులో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు , నిర్మాతలు, అల్లు, మెగా కుటుంబ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య తోపాటు మరికొంతమంది డైరెక్టర్లు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.
దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకొని ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు అల్లు శిరీష్. తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. అల్లు శిరీష్, నయనిక రెడ్డి జంట చూడముచ్చటగా ఉంది. వైట్ అండ్ గోల్డ్ షేర్వానీలో అల్లు శిరీష్ అందంగా కనిపించగా.. అదే కాంబినేషన్లో నయనిక రెడ్డి పెళ్లికూతురిలా మరింత అందంగా ముస్తాబయింది. లక్ష్మీ నారాయణులను తలపిస్తూ తమ అందంతో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం అల్లు శిరీష్ పెళ్లి వేడుక కన్నుల విందుగా జరిగిందని చెప్పవచ్చు.
ఇకపోతే అల్లు శిరీష్, నయనిక రెడ్డి జంట పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, నారా లోకేష్ లని మొదలుకొని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదెల , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, హీరో వరుణ్ తేజ్ ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి, వైష్ణవ తేజ్ , సాయి దుర్గా తేజ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇలా ఎంతోమంది ఈ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఇంకా ఈ వేడుకకు చాలామంది సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక తమ్ముడి పెళ్లిలో అల్లు అర్జున్ ఆయన సతీమణితో పాటు తల్లిదండ్రులు అల్లు అరవింద్ ఆయన సతీమణి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
వరుణ్ తేజ్,, లావణ్య త్రిపాఠీల పెళ్లి సందర్భంగా హీరో నితిన్ ఆయన భార్య షాలిని ఇచ్చిన ప్రైవేట్ పార్టీలో షాలిని స్నేహితురాలు నయానిక రెడ్డిని అల్లు శిరీష్ తొలిసారి కలుసుకున్నారు. ఇక అలా తొలిచూపులో మొదలైన ప్రేమ దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక ఎట్టకేలకు ఈ జంట వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. మొత్తానికైతే అల్లు శిరీష్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయిపోయారు. ఇక ఆయన కెరియర్ లో కూడా మంచి విజయాలు అందుకొని మరింత బిజీగా మారాలని ఆశిద్దాం..
So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika
వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు
Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️
Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX
— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026
అల్లు శిరీష్, నయనక రెడ్డిల వివాహం ఎంతో ఆనందంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ప్రముఖుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


