|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లి: మెగాస్టార్ ఇంటికి తొలి ఆహ్వానం! వివాహ వేడుకలో సందడి!!

Published: 15-02-2026, 8:05 AM
అల్లు శిరీష్ పెళ్లి: మెగాస్టార్ ఇంటికి తొలి ఆహ్వానం! వివాహ వేడుకలో సందడి!!
  • అల్లు శిరీష్, నైనికల వివాహం మార్చి 6న జరగనుంది.
  • చిరంజీవి, సురేఖ దంపతులకు మొదటి పెళ్లి పత్రికను అందజేసిన అల్లు శిరీష్.
  • అల్లు అరవింద్ తన ఇంటి ఆడపడుచుకు పట్టుబట్టలు పెట్టి పెళ్లికి ఆహ్వానించారు.
  • ప్రేమ వివాహం చేసుకుంటున్న శిరీష్, నైనిక.. వీరి నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది.

అల్లు శిరీష్ త్వరలో నైనికను వివాహం చేసుకోనున్నారు. అల్లు అరవింద్ కుటుంబం మొదటి ఆహ్వాన పత్రికను చిరంజీవి ఇంటికి వెళ్లి అందించింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవికి పెళ్లి పత్రిక అందజేత

Allu Sirish: అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ చిన్న కుమారుడైన శిరీష్ (Allu Sirish) మార్చి ఆరవ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వీరి పెళ్లి దగ్గర పడుతున్న నేపథ్యంలో పెళ్లి పనులను కూడా ప్రారంభించారు. ఇప్పటికే అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోటచేరి ఎంతో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ పెళ్లికి ఆహ్వాన పత్రికలను పంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదటి ఆహ్వాన పత్రికను (wedding Invitation)తన మామయ్య చిరంజీవి సురేఖ దంపతులకు అందించినట్లు శిరీష్ తెలిపారు. అల్లు అరవింద్ దంపతులతో పాటు శిరీష్ సైతం చిరంజీవి (Chiranjeevi)ఇంటికి వెళ్లి స్వయంగా సురేఖ చిరంజీవికి మన తెలుగు సాంప్రదాయ బద్ధంగా పట్టుబట్టలను పెట్టి మొదటి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు శిరీష్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.

వైభవంగా అల్లు శిరీష్ వివాహం

తన మొదటి శుభలేఖను అల్లు అరవింద్ తన ఇంటి ఆడపడుచుకు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. ఇలా శిరీష్ పెళ్లి వేడుకలను చూస్తుంటే అచ్చ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక అల్లు శిరీష్ చిన్న అబ్బాయి కావడంతో తన పెళ్లి వేడుకను అల్లు అరవింద్ చాలా వైభవంగా నిర్వహించబోతున్నారని సమాచారం. ఇక ఈ పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాలను ఇంకా వెల్లడించలేదు కానీ పెళ్లి పనులు మాత్రం వేగవంతం చేశారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రేమ వివాహం చేసుకుంటున్న శిరీష్..

ప్రేమ వివాహం చేసుకుంటున్న శిరీష్

ఇక మార్చి 6వ తేదీ అల్లు శిరీష్, నైనికల వివాహ వేడుక జరగనుంది. ఇక నైనిక విషయానికి వస్తే ఈమె ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా అల్లు శిరీష్ నైనిక ప్రేమలో ఉంటూ ప్రేమ వివాహాన్ని చేసుకోబోతున్నారు. గత ఏడాది అక్టోబర్ 31వ తేదీ వీరి నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ ఏడాది మార్చిలో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక అల్లు అర్జున్ తరహాలోనే అల్లు శిరీష్ కూడా ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం. అలాగే అల్లు అర్జున్ పెళ్లి తేదీనే అల్లు శిరీష్ పెళ్లి చేసుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లి వేడుక తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.