|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమర్‌దీప్ ‘సుమతీ శతకం’ మూవీకి ఊహించని ట్విస్ట్! రవితేజ రివ్యూతో రికార్డులు షురూ?

Published: 04-02-2026, 4:35 AM
అమర్‌దీప్ 'సుమతీ శతకం' మూవీకి ఊహించని ట్విస్ట్! రవితేజ రివ్యూతో రికార్డులు షురూ?
  • అమర్ దీప్, సైలీ చౌదరి హీరోహీరోయిన్లుగా ‘సుమతీ శతకం’ మూవీ!
  • ఫిబ్రవరి 6న మైత్రీ మూవీస్ ద్వారా గ్రాండ్ రిలీజ్!
  • సెన్సార్ పూర్తి.. యు/ఏ సర్టిఫికెట్ పొందిన చిత్రం!
  • రవితేజ వీడియో: సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నా!

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా వస్తున్న ‘సుమతీ శతకం’ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. రవితేజ స్వయంగా సినిమా గురించి మాట్లాడటంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో అమర్ దీప్ ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.

యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సుమతీ శతకం’

సీరియల్స్‌తో ఫేమస్ అయిన అమర్ దీప్ చౌదరి (Amar Deep Chowdary) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టి అక్కడ తన గేమ్‌తో రన్నరప్‌గా నిలిచారు. ఇక బయటకు వచ్చాక వరుస షోస్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అలాగే బీబీ జోడీలో తన డ్యాన్స్‌తో అదరగొడుతున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటికి వచ్చాక అమర్ దీప్, సైలీ చౌదరి (Saylim Chaudhari) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుమతీ శతకం’ (Sumathi Satakam).

రవితేజ ప్రశంసలు.. సినిమాకు ఊహించని హైప్

ఎం. ఎం. నాయుడు (MM Naidu) దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీరో కట్స్‌తో ఈ సినిమా యు.ఏ సర్టిఫికెట్‌ పొందిందని, సెన్సార్‌ వారు కూడా అభినందించారని మేకర్స్‌ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘U/A సర్టిఫైడ్.. కుటుంబాలు మరియు హృదయాలను ఒకేలా చూసే చిత్రం.. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల

కాగా అమర్ దీప్ మాస్ మహారాజ్ రవితేజ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ చూసిన రవితేజ తాజాగా స్పందిస్తూ.. సినిమా కంటెంట్ నాకు బాగా నచ్చింది. ఈ మూవీ మంచి హిట్ కావాలని, అతని భవిష్యత్తు అద్భుతంగా ఉంటాలంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. మరి ఈ సినిమాతో హీరోగా అమర్ దీప్ ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాల్సి ఉంది.

‘సుమతీ శతకం’ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. రవితేజ ప్రశంసలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అమర్ దీప్ కెరీర్ ఈ సినిమాతో ఎలా మారుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.