|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

Published: 21-06-2025, 4:55 AM
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో అనేక తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఉత్తమమైన 5 సినిమాలను మేము మీకు సిఫార్సు చేస్తున్నాం.

Key Points

1

అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితా ఇక్కడ ఉంది.

2

పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, అనేక హిందీ, తమిళ సినిమాలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.

4

అన్ని సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు

ఓటీటీ ప్రపంచంలో ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో. డిఫరెంట్ కంటెంట్‌తో అలరించే అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (జూన్ 21) టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, అందులో ది బెస్ట్ 5 ఓటీటీ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో ది ట్రెయిటర్స్. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

పవన్ కల్యాణ్ ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి హీరోగా నటించిన హిందీ వార్ బ్యాక్ డ్రామ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్రౌండ్ జీరో అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 2 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

నవీన్ చంద్ర నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లెవెన్. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన లెవెన్ ఇవాళ టాప్ 3, టాప్ 7 రెండు స్థానాల్లో ట్రెండ్ అవుతోంది. ఏకంగా రెండు ప్లేసుల్లో ఓటీటీ ట్రెండింగ్ అవడం, ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్లతో సాగే ఈ సినిమాను చూడటం బెస్ట్ ఆప్షన్.

చూడాల్సిన టాప్ 5 సినిమాలు

విజయ్ సేతుపతి నటించిన హీస్ట్ క్రైమ్ కామెడీ తమిళ చిత్రం ఏస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషలో టాప్ 4 ప్లేసులో అమెజాన్ ప్రైమ్‌ లో ఏస్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా చూడటం బెటర్ ఆప్షన్.

నవీన్ చంద్ర నటించిన మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ ప్రైమ్ వీడియోలో టాప్ 5వ స్థానంలో ఓటీటీ ట్రెండింగ్‌ లో ఉంది. ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా చూసేందుకు బెస్ట్.

హిందీ టైమ్ ట్రావెల్ కామెడీ చిత్రం భూల్ చుక్ మాఫ్. వామికా గబ్బి, రాజ్ కుమార్ రావు జోడీ కట్టిన భూల్ చుక్ మాఫ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 6వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్

ఆద్యంతం కామెడీతో ఎంటర్‌టైన్ చేసే సింగిల్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో చూడటం బెస్ట్ ఆప్షన్. శ్రీ విష్ణు , వెన్నెల కిశోర్ కామెడీ పండించిన సింగిల్ ఓటీటీలో టాప్ 8 ప్లేసులో తెలుగులో ట్రెండ్ అవుతోంది.

తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది అకౌంటెంట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 9 స్థానంలో ఓటీటీ ట్రెండ్ అవుతోంది. అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమా కూడా చూసేందుకు బెస్ట్.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కామెడీ సిరీస్ పంచాయత్ హిందీలో టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. ఇలా ఇవాళ్టీ అమెజాన్ ప్రైమ్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూసేందుకు బెస్ట్‌గా ఉన్న ఐదింటిని చూసేయండి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అనేక ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.