|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రీనా దత్తాని పెళ్లి చేసుకుని తప్పు చేశా, పెద్ద షాకిచ్చిన అమీర్‌ ఖాన్‌.. గౌరీతో పెళ్లిపై క్లారిటీ

Published: 02-06-2025, 6:42 AM
రీనా దత్తాని పెళ్లి చేసుకుని తప్పు చేశా, పెద్ద షాకిచ్చిన అమీర్‌ ఖాన్‌.. గౌరీతో పెళ్లిపై క్లారిటీ

‘మహాభారతం’ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పే అమీర్ ఖాన్, తన మొదటి భార్య రీనా దత్తాతో పెళ్లి తొందరపాటు నిర్ణయమని వెల్లడించాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Key Points

1

అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో పెళ్లి తొందరపాటు నిర్ణయమని చెప్పాడు.

2

నాలుగు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు.

4

ఇద్దరు మాజీ భార్యలతో మంచి సంబంధాలు ఉన్నాయని అన్నాడు.

రీనా దత్తాతో పెళ్లిపై అమీర్ ఖాన్ ఆవేదన

‘మహాభారతం’ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్లు అమీర్‌ ఖాన్ ఇటీవలే చెప్పి షాకిచ్చారు. ఫ్యాన్స్ అందరిని కలవరానికి గురి చేశారు. ఇదే సమయంలో మరో ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి షాకింగ్‌ కామెంట్‌ చేశారు.

పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. `రాజ్ షమ్ని` పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తన మొదటి భార్య రీనా దత్తాతో పెళ్లి తొందరపాటు నిర్ణయం అని చెప్పారు. అది తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆయన అన్నారు.

కేవలం నాలుగు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆలోచిస్తే ఆ నిర్ణయం తప్పు అనిపిస్తుందని చెప్పారు. 39 ఏళ్ల క్రితం తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ఊహించుకోలేనని తెలిపారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

గౌరీతో సంబంధంపై క్లారిటీ

అమీర్‌ ఖాన్ ప్రస్తుతం  ‘సీతారే జమీన్ పర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏమిటని అడిగినప్పుడు, “చాలా తప్పులు చేశాను, కానీ ఆ తప్పుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా సక్సెస్‌ వల్ల కాదు, నా తప్పుల కారణంగానే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను` అని వెల్లడించారు అమీర్.

రీనా, నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం. నాకు 21 ఏళ్లు, ఆమెకు 18-19 ఏళ్లు. ఏప్రిల్ 18న మా పెళ్లి జరిగింది. అంతకు ముందు కేవలం నాలుగు నెలలు మాత్రమే మేం ఒకరికొకరం తెలుసు. ఆ నాలుగు నెలల్లో కూడా ఎక్కువ సమయం కలిసి గడపలేదు.

మాజీ భార్యలతో మంచి సంబంధాలు

కానీ మా మధ్య చాలా ప్రేమ ఉండేది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే, పెళ్లి లాంటి ముఖ్యమైన నిర్ణయం ఆలోచించి తీసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరినైనా కలిసి నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానా? లేదు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని ఇంత తొందరగా ఎలా నిర్ణయించుకోగలను?” అని అమీర్‌ చెప్పారు.

గౌరీ స్ప్రాట్‌ ని అనుకోకుండా కలిశానని, స్నేహితులుగా మొదలై ప్రేమగా మారిందని అమీర్ చెప్పారు. గౌరీని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తన ఇద్దరు మాజీ భార్యలతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, వారిని గౌరవిస్తానని ఆయన అన్నారు. ఈ లెక్కన గౌరీతో అమీర్‌ సహజీవనం చేయబోతున్నాడని చెప్పొచ్చు.

అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన జీవితంలోని నిర్ణయాల గురించి ఆయన చూపిన ఓపెన్ నెస్ ప్రశంసనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.