
📌 Key Points
- దేశంలో ఆయిల్, గ్యాస్ కొరత లేదని అమిత్ షా స్పష్టీకరణ.
- ప్రజలు భయాందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి.
- ప్రపంచంలో సంక్షేమ భారాన్ని తగ్గించిన మొదటి దేశం భారతదేశం అని అమిత్ షా వ్యాఖ్య.
- బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమని అమిత్ షా జోస్యం.
దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బెంగాల్ ఎన్నికల గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో గ్యాస్, ఆయిల్ కొరత లేదు: అమిత్ షా
భారత దేశ వ్యాప్తంగా చమురు, LPG కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ లైన్ లో నిత్యం కనిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పదే పదే కేంద్ర ప్రభుత్వం, ఎవరు ఆందోళన చెందకూడదని కోరుతోంది. లేటెస్ట్ గా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో ఎలాంటి సమస్య రాదని.. గ్యాస్, ఆయిల్ కొరత ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. కొంత మంది తప్పుడు ప్రచారం.. దాని వల్ల జనాలు భయాందోళనకు గురికాకూడదని కోరారు.
ప్రజలు భయాందోళన చెందవద్దు: కేంద్ర మంత్రి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని జనాలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు అమిత్ షా. ఏ యుద్ధంలోనూ ఇండియా జోక్యం చేసుకోవాలని కోరుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్ధ సంక్షోభం ఉన్న నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించినట్లు వివరించారు. సంక్షేమం భారాన్ని తనపై వేసుకున్న మొట్టమొదటి దేశం ఇండియా అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా చేయలేదని తాజాగా ఓ సమ్మిట్ లో వెల్లడించారు అమిత్ షా.
బెంగాల్‌లో టీఎంసీ ఓటమి తథ్యం: అమిత్ షా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా రియాక్ట్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. టీఎంసీ అవినీతి, అరాచక పాలనపై బెంగాల్ ప్రజలు విసిగిపోయినట్లు తెలిపారు. ఈ తరుణంలోనే బీజేపీ అధికారంలోకి రాబోతుందని వ్యాఖ్యానించారు.
మొత్తానికి అమిత్ షా దేశంలో గ్యాస్, ఆయిల్ కొరత లేదని తేల్చి చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బెంగాల్ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


