
📌 Key Points
- నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.
- కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ వెడ్డింగ్ కామెడీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
- నిర్మాత నాగవంశీ సినిమా మొదటి అర్ధభాగాన్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారు.
- దర్శకుడు కళ్యాణ్ శంకర్‌కు 12 లక్షల రూపాయల విలువైన ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు.
సంక్రాంతికి విడుదల కానున్న నవీన్ పోలిశెట్టి “అనగనగా ఒక రాజు” సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా మొదటి భాగాన్ని చూసిన నిర్మాత నాగవంశీ, దర్శకుడు కళ్యాణ్ శంకర్‌కు రూ.12 లక్షల విలువైన ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాత నాగవంశీని ఆకట్టుకున్న “అనగనగా ఒక రాజు”
Anaganaga Oka Raju: సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరిలోనే నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మరో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) తెరకెక్కిన ఈ సినిమా వెడ్డింగ్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సెన్సార్ కాఫీ కోసం నాగ వంశీ ఈ సినిమాని చూశారట అయితే మొదటి హాఫ్ చూడగానే ఈ సినిమాకు ఎంతో ఇంప్రెస్ అయిన ఈయన డైరెక్టర్ కు ఊహించని కానుక ఇచ్చారని తెలుస్తోంది.
దర్శకుడు కళ్యాణ్ శంకర్‌కు ఖరీదైన బహుమతి
ఇలా ఫస్ట్ హాఫ్ చూడగానే నాగ వంశీకి ఎంతగానో ఈ సినిమా నచ్చేసిందని, అందుకే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కోసం 12 లక్షల విలువైన కాస్ట్లీ వాచ్ గిఫ్టుగా ఇచ్చినట్టు సమాచారం. ఇలా ఖరీదైన కానుకతో దర్శకుడు పనితీరును నాగ వంశీ ప్రశంసించారని తెలుస్తోంది. ఇక ఇటీవల నాగ వంశీ నిర్మాణంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా పూర్తిగా తనని నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాది మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అనగనగా ఒక రాజు పైనే నాగ వంశీ ఆశలు..
నవీన్ పోలిశెట్టి సినిమాపై అంచనాలు
ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నాగ వంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి సినిమా అంటేనే ప్రేక్షకులకు కావలసిన వినోదం ఉంటుందని చెప్పాలి. ఇప్పటివరకు నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనగనగా ఒక రాజు సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించడం విశేషం. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది అనగనగా ఒక రాజు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
గత సినిమాల నిరాశ తర్వాత, ‘అనగనగా ఒక రాజు’పై నాగవంశీ చాలా ఆశలు పెట్టుకున్నారు. నవీన్ పోలిశెట్టి కామెడీకి ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ ఇస్తారు కాబట్టి, ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.


