
📌 Key Points
- భీమవరం రాజుగా నవీన్ పొలిశెట్టి విధ్వంసం! కామెడీ టైమింగ్, వన్ లైన్ పంచ్‌లతో థియేటర్లలో నవ్వుల విందు!!
- మీనాక్షి చౌదరితో నవీన్ కెమిస్ట్రీ అదుర్స్! ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్!!
- రావు రమేష్ కామెడీ టైమింగ్, తారక్ పొన్నప్ప విలనిజం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!!
- సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్! కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు నవీన్!!
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉంది? మీనాక్షి చౌదరితో కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? చూసేద్దాం!
భీమవరం రాజుగా నవీన్ అల్లరి!
సంక్రాంతికి భీమవరం రాజుగా హంగామా చేయడానికి థియేటర్లలోకి వచ్చేశాడు నవీన్ పొలిశెట్టి. అతను హీరోగా నటించిన అనగనగా ఒక రాజు మూవీ ఇవాళ రిలీజైంది. మరి మూవీ ఎలా ఉంది? కామెడీ వర్కౌట్ అయిందా? నవీన్ కు హిట్ దక్కిందా? అన్నది అనగనగా ఒక రాజు రివ్యూలో చూసేయండి.
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, గోపరాజు రమణ, తారక్ పొన్నప్ప, మహేశ్, చమ్మక్ చంద్ర, భద్రం, మాస్టర్ రేవంత్ తదితరులు
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
చారుతో రాజు ఆపరేషన్ సక్సెస్?
రిలీజ్ డేట్: జనవరి 14, 2026
సంక్రాంతి 2026 రేసులో పెద్ద సినిమాలు ఉన్నాగానే నవీన్ పొలిశెట్టి ధైర్యం చేసి అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కు సై అన్నాడు. సినిమాలోని కంటెంట్ మీద అతనికి ఉన్న నమ్మకం అలాంటిది. భీమవరం రాజుగా ట్రైలర్ లో నవీన్ అల్లరి, మీనాక్షి చౌదరి తో కెమిస్ట్రీ మూవీపై అంచనాలు పెంచేశాయి.
పర్ఫెక్ట్ పండగ సినిమాలా అనగనగా ఒక రాజు మూవీని రెడీ చేయడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఇవాళ రిలీజైన ఈ మూవీ ఆకట్టుకుందా? నవీన్ కామెడీ పని చేసిందా? మీనాక్షితో అతని కెమిస్ట్రీ ఎలా ఉంది? అనేది ఈ రోజు అనగనగా ఒక రాజు రివ్యూ లో చూసేద్దాం.
అప్పుడే పెద్దిపాలెం భూపతి రాజు (రావు రమేష్) కూతురు చారు (మీనాక్షి చౌదరి)ను చూస్తాడు. ఆమెకు కోట్ల ఆస్తి ఉందని తెలుసుకుంటాడు. ఎలాగైనా చారును పడేయాలని ‘ఆపరేషన్ చారు’ స్టార్ట్ చేస్తాడు. దాని కోసం ఎన్నో తంటాలు పడతాడు. చివరకు చారుతో పెళ్లి జరుగుతుంది. కానీ ఫస్ట్ నైట్ రోజు రాజుకు ఓ లెటర్ వస్తుంది. దీంతో కథ మలుపు తిరుగుతుంది.
కామెడీతో నవీన్ హిట్ కొట్టాడా?
అసలు ఆ లెటర్ ఎవరు రాశారు? అందులో ఏముంది? పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎర్రిబాబు (తారక్ పొన్నప్ప)కు పోటీగా రాజు ఎందుకు నిలబడ్డాడు? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ఆస్తి లేకపోయినా రిచ్ అంటూ బిల్డప్ ఇచ్చే రాజు, అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా వన్ లైన్ పంచ్ లు బాగా పేలాయి. ఇక రాజు, చారు మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
ఇక సెకండాఫ్ లో కథ మొత్తం ముఖ్యంగా ఎన్నికలపైకి మళ్లుతుంది. రాజు నామినేషన్ వేయడం, ఎన్నికల ప్రచారం కూడా కావాల్సినంత ఫన్ అందిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లు కూడా వర్కౌటయ్యాయి. క్లైమాక్స్ కూడా కన్వీన్స్ గా ఉంటుంది.
నవీన్ తో కెమిస్ట్రీ ఆమెకు బాగా కుదిరింది. రావు రమేష్ పాత్రకు కూడా సినిమాలో ప్రాధాన్యం దక్కింది. రాజు గ్యాంగ్ గా చమ్మక్ చంద్ర, మహేష్, భద్రం నవ్వించారు. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మాస్టర్ రేవంత్ కూడా మరోసారి ఆడియన్స్ మనసు దోచుకున్నాడు.
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ కలగలిసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


