
📌 Key Points
- అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ప్లాప్ హీరో నాగశౌర్య అని తెలిసి షాక్!
- వకీల్ సాబ్ బ్యూటీ అనన్య ప్రేమ రహస్యం బయటపెట్టింది.
- సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్‌పై అనన్య భయం.
- నాగశౌర్య వరుస ప్లాపుల తర్వాత అనన్య ప్రేమ వార్త వైరల్.
టాలీవుడ్ సంచలనం అనన్య నాగళ్ల తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. ప్లాప్ హీరోపై ఆమె ప్రేమ.. ఫస్ట్ క్రష్ ఎవరో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు!
అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ స్టార్ అనన్య నాగళ్ల. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన అనన్య, నటనపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఆ సినిమా తరువాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. ఈసినిమా అనన్య కెరీర్ కు బాగా ఉపయోగపడింది. . గ్లామర్‌తో పాటు యాక్టింగ్ లో కూడా తన ప్రత్యేకతను చూపిస్తూ యంగ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అనన్య నాగళ్ల.
ప్లాప్ హీరోపై ప్రేమ.. సంచలనం!
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నాగళ్ల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. చిన్నతనం నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు చూస్తు పెరిగానని, ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా.. తన ఫస్ట్ క్రష్ మాత్రం టాలీవుడ్ హీరో నాగశౌర్య నే అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం వరుస ప్లాపులతో ఫామ్ ను కోల్పోయాడు నాగశౌర్య. ఒకప్పుడు ఊహలు గుసగుసలాడే, ఛాలో లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. గత నాలుగైదు ఏళ్లుగా నాగశౌర్య చేసిన ఏ సినిమాలు యావరేజ్ గా కూడా నడవడంలేదు. ఇక పెళ్లి తరువాత అసలు కనిపించడమే మానేశాడు యంగ్ హీరో. ఈమధ్య బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందనేది కూడా చాలామందికి తెలియదు. ఈ హీరో తన ఫస్ట్ క్రష్ అని అనన్య నాగళ్ళ వెల్లడించింది.
పెళ్లి, సినీ పరిశ్రమపై అనన్య కామెంట్స్
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ, తనకు కాబోయే వ్యక్తి నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన అనన్య, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ విషయంలో కొంత భయం ఉందని అంటోంది. సినీ పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలపై స్పందించిన ఆమె, ఇప్పటివరకు తనకు ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనని, తన పని మీదే పూర్తిగా దృష్టి పెడతానని అంటోంది.
అనన్య నాగళ్ల ప్రేమ, పెళ్లిపై చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. ఆమె భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి. మరెన్నో ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


