
📌 Key Points
- శివాజీ కామెంట్స్ పై అనసూయ ఫైర్.. దుస్తులపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్!
- సమస్య దుస్తుల్లో కాదు.. పురుషుల ఆలోచనల్లో ఉందన్న అనసూయ భరద్వాజ్.
- ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వైరల్.. దుమారం రేపిన కామెంట్స్.
- పట్టుచీరలో అనసూయ వీడియో వైరల్.. శివాజీకి కౌంటర్ అంటూ నెటిజన్ల కామెంట్స్.
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అనసూయ, శివాజీ వివాదం! శివాజీ చేసిన కామెంట్స్ పై అనసూయ ఘాటుగా స్పందించడం ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా!
శివాజీ కామెంట్స్ పై అనసూయ కౌంటర్ ఎటాక్!
రీసెంట్ గా లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపాయి.. చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో శివాజీని విమర్శించారు. అందులో యాంకర్ అనసూయ అయితే పెద్ద యుద్దమే చేసింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత వచ్చినా.. తగ్గలేదు స్టార్ యాంకర్. శివాజీ పై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. ఇండస్ట్రీలో కూడా ఈ విషయం పెద్ద దుమారమే రేపింది.
ఈ వివాదంలో కొంత మంది శివాజీకి సపోర్ట్ చేయగా.. మరికొంత మంది మాత్రం ఆయన్ను విమర్శించారు. శివాజీ vs అనసూయ గా మారి తెగ హడావిడి చేశారు. ఇక ఈ సోషల్ మీడియావార్ లో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దుస్తులపై కామెంట్స్.. నెట్టింట దుమారం రేపిన వివాదం!
‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ, మహిళలు నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, శరీరం కనిపించేలా దుస్తులు ధరించడం సరైంది కాదని కామెంట్స్ చేశారు.. అంతేకాదు, అలాంటి దుస్తులు వేసుకునే వారిపై ప్రజలు బయట నవ్వినా, లోపల మాత్రం విమర్శిస్తారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ భరద్వాజ్, మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత ఎంపిక అని స్పష్టం చేశారు. అసలు సమస్య దుస్తుల్లో లేదని, పురుషుల ఆలోచనా విధానం, మహిళల పట్ల ప్రవర్తనలో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె అభిప్రాయానికి అనేక మంది సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు సపోర్ట్ తెలిపారు. కొన్ని రోజులు ఇలానే కొనసాగిన వివాదం.. ఆతరువాత సర్దుమణుగుతూ వచ్చింది.
వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ వీడియో!
ఇక ఈ వివాదం అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో తాజాగా అనసూయ చేసిన పోస్ట్ మళ్లీ రచ్చకు దారి తీసింది. ఒక వీడియోతో మళ్లీ ఈ వివాదాన్ని మొదలు పెట్టింది అనసూయ. ఆ వీడియోలో ఆమె సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని తన భర్తతో కలిసి కనిపించారు. ఈ వీడియోను ఒక న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ” అంటూ క్యాప్షన్ ఇవ్వడం కొత్త వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన అనసూయ తనదైన మార్క్ లో కౌంటర్ ఇచ్చింది.
అనసూయ పోస్ట్ లో ఏముందంటే.. “తప్పు తప్పు.. ‘శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ’ అని కదా హెడ్డింగ్ ఉండాలి. ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు” అంటూ ఆమె సెటైరికల్‌గా స్పందించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనసూయ తన కామెంట్ సెక్షన్‌ను లాక్ చేయడంతో నెటిజన్లు స్పందించే అవకాశం లేకుండా పోయింది. మరి ఈ వివాదం మళ్ళీ ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.
అనసూయ, శివాజీల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


