
అనసూయ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. తన మేనేజర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన మహేంద్ర పదవి నుంచి రిలీవ్ అయ్యారని ఆమె ప్రకటించారు. ఈ పోస్ట్‌లో మహేంద్రకు కృతజ్ఞతలు తెలుపుతూ, కొత్త అధికారిక సంప్రదింపుల వివరాలను కూడా అనసూయ పంచుకున్నారు. ఈ వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Key Points
సినిమాలు, టీవీ షోలతో అనసూయ బిజీగా ఉన్నారు.
సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.
తన మేనేజర్ మహేంద్ర పదవి నుంచి రిలీవ్ అయ్యారని అనసూయ ప్రకటించారు.
మహేంద్రకు కృతజ్ఞతలు తెలుపుతూ, కొత్త ఈమెయిల్ ఐడీని పంచుకున్నారు.
అనసూయ సోషల్ మీడియా యాక్టివిటీ
ఒకవైపు సినిమాలు .. మరోవైపు టీవీ షోలతో ఫుల్ బిజీ అయిపోతుంది అనసూయ(Anasuya Bharadwaj) . యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి .. ఇప్పుడు నటిగా కొనసాగుతుంది . అయితే మధ్య మధ్యలో టీవీ షోలలోనూ మెరుస్తూ .. అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది . ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి గురించి అందరికి తెలిసిందే . నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ .. తన సినిమా అప్ డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది . నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది పట్టించుకోకుండా .. తను చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది .
మేనేజర్‌పై అనసూయ ఇన్‌స్టా పోస్ట్
తాజాగా అనసూయ తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది . తనకు మేనేజర్ గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ చెబుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.
కొత్త అధికారిక సంప్రదింపుల వివరాలు
నా సుధీర్ఘమైన సీనీ ప్రయాణంలో తోడుగా ఉన్న నా మేనేజర్ మిస్టర్ మహేంద్ర.. తన పదవి నుంచి రిలీవ్ అవుతున్నారు . ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో ఎంతో నేర్చుకున్నాం. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్‌గా ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపై ఏదైనా అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం, వృత్తిపరమైన విషయాల కోసం దయచేసి [email protected] మెయిల్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్‌కి మా టీం కాంటాక్ట్ అవుతారు ’ అని అనసూయ రాసుకొచ్చింది .
అనసూయ తన మేనేజర్‌ను తొలగించడం, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె నిక్కచ్చి స్వభావానికి ఇది నిదర్శనం అని నెటిజన్లు అంటున్నారు. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.


