|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయకు రాశి షాకింగ్ కౌంటర్: ‘రాశి గారి ఫలాలు’ వ్యాఖ్యపై రగడ!

Published: 04-01-2026, 12:00 PM
అనసూయకు రాశి షాకింగ్ కౌంటర్: 'రాశి గారి ఫలాలు' వ్యాఖ్యపై రగడ!
  • అనసూయ ఒక టీవీ షోలో జబర్దస్త్ ఆదిని ఉద్దేశించి ‘రాశి గారి ఫలాలు’ అంటూ వ్యాఖ్యానించారు.
  • ఈ వ్యాఖ్యలను నటి రాశి తీవ్రంగా ఖండించారు, అవి తనను అవమానపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.
  • ఒక మహిళ శరీరంపై వ్యాఖ్యలు చేయడానికి ఎవరికీ హక్కు లేదని రాశి స్పష్టం చేశారు.
  • శివాజీ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించిన అనసూయ, ఇప్పుడు తన పాత వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చర్చ.

అనసూయ గతంలో చేసిన ‘రాశి గారి ఫలాలు’ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నటి రాశి తీవ్రంగా స్పందించారు, తన శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

అనసూయ పాత వ్యాఖ్య, కొత్త రచ్చ

Rashi Fires on Anasuya: ఇటీవల సోషల్ మీడియాలో అనసూయపై జరుగుతున్న చర్చలు బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఎవరైనా అమ్మాయిపై చిన్న మాట అన్నా కూడా గట్టిగా స్పందించే వారిలో అనసూయ ముందుంటారు. ఇది చాలా వరకు సరైనదే అని చాలామంది భావిస్తారు. కానీ ఇతరులకు నీతులు చెప్పేటప్పుడు..మనం కూడా అదే పద్ధతిని పాటించాలి అనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

ఈ మధ్య శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అమ్మాయిల గురించి మాట్లాడే తీరుపై ఆమె పెద్ద స్థాయిలో చర్చను తీసుకొచ్చారు. అయితే తాజాగా..అనసూయ చేసిన ఒక పాత వ్యాఖ్య ఇప్పుడు తిరిగి బయటకు వచ్చి.. ఆమెకే ఇబ్బందిగా మారింది.

రాశి తీవ్ర ఆగ్రహం: అసలు ఏమైంది?

ఒక టీవీ షోలో, అనసూయ మాట్లాడుతూ జబర్దస్త్ ఆదిని ఉద్దేశించి “నువ్వు రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా?” అని అనింది. ఈ మాటలు అక్కడున్న వారిని నవ్వించాయి. కానీ ఆ వ్యాఖ్యలను రాశి తీవ్ర స్థాయిలో ఖండించింది…

రాశి మాట్లాడుతూ, “రాశి ఫలాలు అనడం వరకు నాకు సమస్య లేదు. కానీ ‘రాశి గారి ఫలాలు’ అని చెప్పడం అవమానంగా అనిపించింది. అది నా గురించి అని పూర్తిగా అర్థమైంది. అక్కడ ఉన్న జడ్జీలు కూడా నవ్వారు,” అని తెలిపారు. అయితే అప్పుడు ఆ జడ్జి స్థానంలో రోజా ఉంది నవ్వడం గమనర్హం. ఇంకా ఆమె మాట్లాడుతూ, “నేను జడ్జి స్థానంలో ఉంటే.. ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడనివ్వను. ఒక మహిళ శరీరంపై వ్యాఖ్యలు చేయడానికి అమ్మకీ, నాన్నకీ కూడా హక్కు లేదని నేను నమ్ముతాను” అని స్పష్టంగా చెప్పారు.

సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు

ఇప్పుడు రాశి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు అనసూయను ట్యాగ్ చేస్తూ, “ఇప్పుడు దీనిపై ఏం చెబుతారు?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. శివాజీ సామాన్లు అన్న మాటలకు అంతగా రియాక్ట్ అయిన అనసూయ ఇప్పుడు తనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకి రావడంతో.. ఎలా స్పందిస్తుందో చూడాలి.

మహిళల గురించి మాట్లాడే తీరుపై గతంలో గట్టిగా స్పందించిన అనసూయ, ఇప్పుడు తన పాత వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.