
యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ట్రెడిషనల్ దుస్తుల్లో ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. నెటిజన్ల ప్రతిచర్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Key Points
అనసూయ ట్రెడిషనల్ వేర్‌లో అందంగా కనిపించింది.
ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం లేదని అభిప్రాయపడ్డారు.
అనసూయ పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
అనసూయ తాజా ఫోటోలు
జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది. అలాగే మరోసారి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీలో సునీల్(Sunil) భార్య దాక్షాయణిగా నటించి మెప్పించింది. తన నటనతో అందరికీ షాక్‌కు గురిచేసింది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా నటించి అలరించింది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. అయితే కొన్ని కొన్ని సార్లు తన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ట్రోలింగ్‌కి కూడా గురైయింది.
సోషల్ మీడియాలో ప్రతిచర్య
అయినప్పటికీ వారికి గట్టి కౌంటర్ ఇస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాలో కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది. చేతినిండా గాజులు మొహానికి బొట్టు, నగలు, పూలతో అచ్చతెలుగు ఆడపిల్లలా సింగారించుకుంది. ఇక వీటికి.. ‘మంచి పాత పచ్చ గాజులు/ హరి హరి చుడియాన్‌కు మించినది ఏదీ లేదు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఇలా పద్ధతిగా ఉంటే ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ సినిమా జీవితం
A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
అనసూయ యొక్క ఈ ట్రెడిషనల్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ తన అభిమానులను అలరిస్తోంది.


