|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anasuya: మేనేజర్ ను తొలగించిన అనసూయ.. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్ట్

Published: 24-10-2025, 10:11 AM
Anasuya: మేనేజర్ ను తొలగించిన అనసూయ.. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్ట్

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన మేనేజర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించి, ఇకపై తన వృత్తిపరమైన విషయాలకు నేరుగా ఈమెయిల్ ద్వారా సంప్రదించమని కోరింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

అనసూయ టాలీవుడ్ లో హాట్ యాంకర్, నటిగా గుర్తింపు పొందింది.

2

జబర్దస్త్ తర్వాత పూర్తిగా సినిమాలపై దృష్టి సారించి బిజీగా ఉంది.

4

ఇకపై వృత్తిపరమైన విషయాలకు ప్రత్యేకంగా ఇచ్చిన ఈమెయిల్ ఐడీని సంప్రదించాలని కోరింది.

అనసూయ కెరీర్ ప్రస్థానం

Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. జబర్దస్త్ (Anasuya)కామెడీ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత వేడితెరవైపు అడుగులు వేసింది. ఆ తరువాత పూర్తిగా జబర్దస్త్ ను మానేసి సినిమాలపైనే దృష్టి సారించింది. అప్పుడప్పుడు టీవీ షోలు, మరోపక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుందో. ఇవన్నీ టైం కి సెట్ అవ్వాలి అంటే తన డేట్స్ చూసుకునే మేనేజర్ చాలా అవసరం.

మేనేజర్‌ను తొలగించిన అనసూయ ప్రకటన

Akhanda 2: అఖండ 2 టీజర్ వచ్చేసింది.. మాస్ డైలాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య..

ప్రొఫెషనల్ కాంటాక్ట్ కోసం కొత్త విధానం

అయితే, తాజాగా తన మేనేజర్ ను విడుదల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది అనసూయ. ఈ మేరకు సోషల్ మీడియాలో నోట్ కూడా విడుదల చేసింది. “నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉంటూ వచ్చాడు నా మేనేజర్‌ మిస్టర్ మహేంద్ర. ఇప్పుడు ఆయన తన పదవి నుంచి రిలీవ్‌ అవుతున్నారు. ఎన్నో ఏళ్ల ఈ అనుబంధంలో ఎన్నో నేర్చుకున్నాము. మేనేజర్‌గా ఇన్నేళ్లు ఆయన చూపిన కృషి, నిబద్ధతకు నా కృతజ్ఞతలు. ఇకనుంచి ఏదైనా వృత్తిపరమైన విషయాల కోసం [email protected] ఈ మెయిల్ ఐడీని కాంటాక్ట్ అవ్వండి” అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనసూయ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తన కెరీర్ లో కొత్త మార్పులు కోరుకుంటూ, ప్రొఫెషనల్ కాంటాక్ట్‌లకు నేరుగా బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ పోస్ట్ సూచిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.