|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తన బరువుపై తానే సెటైర్ వేసుకున్న అనసూయ..ఇమ్మాన్యుయేల్ కి ముద్దిచ్చిన బుల్లితెర నటి

Published: 07-06-2025, 9:40 AM
తన బరువుపై తానే సెటైర్ వేసుకున్న అనసూయ..ఇమ్మాన్యుయేల్ కి ముద్దిచ్చిన బుల్లితెర నటి

యాంకర్, నటి అనసూయ తన కుటుంబంతో శ్రీలంక వెకేషన్ లో గడిపింది. ఆమె స్విమ్‌వేర్ ఫోటోలు వైరల్ అయ్యాయి. తన బరువు పెరుగుదలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 షో లో…

Key Points

1

అనసూయ తన బరువు పెరుగుదలపై సెటైర్ వేసింది.

2

శ్రీలంక వెకేషన్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

4

అనసూయ, శేఖర్ మాస్టర్ రియాక్షన్ వైరల్ గా మారింది.

అనసూయ శ్రీలంక వెకేషన్

నటిగా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గత కొన్ని వారాలుగా తన ఫ్యామిలీతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల అనసూయ కొత్త ఇంటిని కొనుగోలు చేసి అందులో గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

కుటుంబ సమేతంగా అనసూయ తన భర్త పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. కొత్త ఇంట్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించింది.

ఆ తర్వాత వెంటనే అనసూయ భర్త పిల్లలతో కలిసి శ్రీలంక కు సమ్మర్ వెకేషన్ కి వెళ్ళింది. కొన్ని రోజుల పాటు అనసూయ శ్రీలంకలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ఈ నేపథ్యంలో అనసూయ స్విమ్ వేర్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో భర్తతో రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులు ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అయ్యాయి.

కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 షో

వెకేషన్ పూర్తయ్యాక తిరిగి వచ్చిన అనసూయ వర్క్ తో మళ్ళీ బిజీగా మారింది. అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా బుల్లితెర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది.

కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 అనే టీవీ షోలో అనసూయ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్ కలిసి జడ్జీలుగా పాల్గొంటున్నారు.

ఈ షో కోసం అనసూయ అదిరిపోయే స్కిన్ ఫిట్ సిల్వర్ డ్రస్సులో మెరిసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పటిలాగే అనసూయ ఈ ఫోటోల్లో కూడా గ్లామరస్ గా మెరిసిపోతోంది. ఇటీవల అనసూయ కాస్త బొద్దుగా మారింది.

ఇమ్మాన్యుయేల్ ముద్దు – అనసూయ రియాక్షన్

తన బరువు గురించి తానే సెటైర్ వేస్తూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. హాలిడే వల్ల బరువు పెరిగా.. పట్టించుకోకండి అని ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. హాలిడేలో ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు ఎమోజీల ద్వారా చెప్పకనే చెప్పింది.

కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమో లో బుల్లితెర కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో టీవీ నటి దేబ్జానీ రొమాన్స్ చేస్తూ ముద్దిచ్చింది. దీనితో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

దీనికి అనసూయ, శేఖర్ మాస్టర్ ఇచ్చిన రియాక్షన్ నవ్వులు పూయించే విధంగా ఉంది. ముద్దు పెట్టడం మేము చూడలేదు.. ఇంకోసారి పెట్టమంటూ అనసూయ ఎంకరేజ్ చేయడం వైరల్ గా మారింది.

చివరగా, అనసూయ బరువు పెరుగుదలపై చూపిన సెల్ఫ్ డిప్రికేటింగ్ హ్యూమర్ మరియు షోలో జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీనితో ఆమెకు మరింత ప్రజాదరణ లభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.