|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను ‘ఆంటీ’ అంటున్నారా? శివాజీని ‘గారు’ అంటారా? అనసూయ ఏజ్ షేమింగ్‌పై సంచలన కౌంటర్!

Published: 25-12-2025, 8:37 AM
నన్ను 'ఆంటీ' అంటున్నారా? శివాజీని 'గారు' అంటారా? అనసూయ ఏజ్ షేమింగ్‌పై సంచలన కౌంటర్!
  • శివాజీ ‘సామాన్లు’ వివాదంపై అనసూయ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు.
  • ప్రగతిశీల మహిళలను టార్గెట్ చేస్తున్నారంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్.
  • తనను ‘ఆంటీ’ అంటున్నారని, శివాజీని ‘గారు’ అనడంపై ట్రోలర్స్‌కు సమాధానం.
  • తన వయసు 40, శివాజీ వయసు 54 అని వెల్లడిస్తూ ఫిట్‌నెస్ గురించి ప్రస్తావన.

ప్రముఖ నటుడు శివాజీ వ్యాఖ్యలపై అనసూయ కౌంటర్ ఇవ్వగా, కొంతమంది ఆమెను ట్రోల్ చేశారు. ‘ఆంటీ’ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి అనసూయ గట్టి సమాధానం ఇచ్చింది. తన వయసు, శివాజీ వయసు వెల్లడిస్తూ, ఫిట్‌నెస్‌పై మాట్లాడింది. ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

శివాజీ కామెంట్స్… అనసూయ జనరల్ రియాక్షన్

ప్రముఖ నటుడు శివాజీ ఇటీవల చేసిన సామాన్లు కామెంట్ ఎంత పెద్ద వివాదంగా మారిందో తెలిసిందే. అనసూయ, చిన్మయి మరికొందరు నటీమణులు శివాజీకి కౌంటర్ ఇచ్చారు. అనసూయ సెటైరికల్ గా శివాజీకి కౌంటర్ ఇవ్వడం చూశాం. కొందరు అనసూయకి సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.

కొంతమంది పురుషులు, మరికొంత మంది మహిళలు కూడా నా ఏజ్ ని ఉపయోగించి నన్ను తక్కువగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ఆలోచనలు కలిగిన వారు ప్రగతిశీల మహిళలని లక్ష్యంగా చేసుకుంటారు. మహిళలపై నియంత్రణ కోల్పోతామనే భయం వల్ల ఇలా చేస్తున్నారు. నేను మహిళలు, పురుషులు అందరికీ ఒక విన్నపం చేస్తున్నా. దయచేసి విస్తృతంగా ఆలోచించండి. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటు పడ్డ విషయాలని మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పుని ఎంచుకోవచ్చు పేర్కొంది.

I need to say this.. కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ…

‘ఆంటీ’ అంటూ ట్రోల్స్‌కు అనసూయ గట్టి కౌంటర్

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025

మరో ట్వీట్ లో తనని ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చింది. కొందరు పురుషులు, మహిళలు ఉన్న సమస్య గురించి మాట్లాడడం చేతకాక నన్ను ఆంటీ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారు. కానీ ఆయన్ని మాత్రం గారు అంటున్నారు. నేనేం మోసం చేయను.

నా ఏజ్ 40.. ఆయన ఏజ్ 54 అనుకుంటా. అయినా మేమిద్దరం మా వృత్తి కోసం చక్కగా ఫిట్నెస్, గ్లామర్ మైంటైన్ చేస్తున్నాం. అయినా ఈ అనేవాళ్ళు అంతా నిత్య యవ్వనులు అనుకోండి అది వేరే విషయం అంటూ అనసూయ సెటైర్లు వేసింది.

నా వయసు 40.. ఆయన వయసు 54: అనసూయ వివరణ

Inkokkati last chepta eerojuki.. unna issue ni address cheyatam chaatakaka nannu age shame chestu aunty antunna men and women.. aayanni maatram garu antunnaru.. kani nenu hypocrite ni aipoyanu 😄 naku 40.. aayanaki 54 anukunta.. aina iddaram chakkaga ma profession kosamo personal…

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025

ఇక సినిమాల విషయానికి వస్తే శివాజీ తాజాగా దండోరా అనే చిత్రంలో నటించారు. అనసూయ చివరగా హరిహర వీరమల్లు అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. అనసూయ క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో నటిగా పాపులారిటీ పొందింది.

ఏజ్ షేమింగ్‌పై అనసూయ ఇచ్చిన కౌంటర్ పలువురిని ఆలోచింపజేసింది. వ్యక్తిగత విమర్శలకు బదులుగా అసలు సమస్యపై దృష్టి సారించాలని ఆమె ఇచ్చిన సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ధైర్యవంతమైన నిలబడటం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.