|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ సంచలనం: ఆంటీ ట్రోల్స్ పై అల్టిమేటం.. ‘చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే!’

Published: 25-12-2025, 8:53 AM
అనసూయ సంచలనం: ఆంటీ ట్రోల్స్ పై అల్టిమేటం.. 'చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే!'
  • నటుడు శివాజీ చేసిన వస్త్రధారణ వ్యాఖ్యలపై అనసూయ మరోసారి ఘాటుగా స్పందించారు.
  • తనను ‘ఆంటీ’ అంటూ ఏజ్ షేమ్ చేస్తున్న ట్రోల్స్‌కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది.
  • తన పోస్ట్‌లో, ‘ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే’ అని పేర్కొంది.
  • ఈ వైరల్ పోస్ట్‌తో ప్రస్తుత వివాదానికి ముగింపు పలికి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.

నటి అనసూయ భరద్వాజ్ నటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి ఘాటుగా స్పందించారు. తనను ‘ఆంటీ’ అంటూ ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇస్తూ, ‘చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే’ అని పేర్కొంది. ఆమె లేటెస్ట్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

శివాజీ వివాదంపై అనసూయ స్పందన

Anasuya Bhardwaj: అనసూయ భరద్వాజ్ రెండు రోజులుగా నటుడు శివాజీ విషయంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. శివాజీ తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అమ్మాయిల వస్త్రధారణ గురించి ముఖ్యంగా హీరోయిన్లు ఇటీవల కాలంలో వారి వస్త్రధారణ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో శివాజీ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ కేసు కూడా నమోదు చేయటంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ వివాదం పై శివాజీ స్పందించి క్షమాపణలు తెలియజేస్తూ తన మాటల వెనుక ఉద్దేశం ఏంటో తెలియజేశారు.

ఇక శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై అనసూయ తరచు సంచలనమైన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె మరొక పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈరోజుకి ఇదే చివరి పోస్ట్ అంటూ ఈమె తెలియజేశారు. ఇందులో భాగంగా తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన వారి పట్ల అనసూయ కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం తలెత్తిన వివాదం గురించి మాట్లాడటం చేతకాక నన్ను ఏజ్ షేమ్ చేస్తూ ఆంటీ అని పిలుస్తున్నారు, కానీ ఆయనని మాత్రం గారు అంటూ పిలుస్తున్నారు. నాకు 40 సంవత్సరాలు ఆయనకి 54 అనుకుంటా. అయినా ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్స్ కోసం వ్యక్తిగతంగా ఫిట్నెస్, గ్లామర్ ని అలాగే చూసుకుంటున్నాం .

కొంతమంది మధ్యలో వచ్చి మమ్మల్ని అంటున్నారు ఈ అనే వాళ్ళందరూ నిత్యం యవ్వనలు అది వేరే విషయం అనుకోండి, సర్లేండి ఇంకా ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. ఈ విషయాన్ని పక్కనపెట్టి సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోండి అంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ వివాదానికి అనసూయ ఇంతటితో చెక్ పెట్టినట్టేనా? లేదంటే మరోసారి స్పందిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

‘ఆంటీ’ ట్రోల్స్‌కు ఘాటు కౌంటర్

Inkokkati last chepta eerojuki.. unna issue ni address cheyatam chaatakaka nannu age shame chestu aunty antunna men and women.. aayanni maatram garu antunnaru.. kani nenu hypocrite ni aipoyanu 😄 naku 40.. aayanaki 54 anukunta.. aina iddaram chakkaga ma profession kosamo personal…

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025

వైరల్ పోస్ట్: వివాదానికి ముగింపు?

ఇలా అనసూయ గత రెండు రోజులుగా పరోక్షంగా శివాజీకి కౌంటర్ ఇస్తూ చేస్తున్న పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక గతంలో కూడా అనసూయ తనని ఎవరైతే ఆంటీ అంటూ ట్రోల్ చేశారో వారందరికీ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు తనకంటే వయసులో చిన్నవాళ్లు ఆంటీ అంటే పర్లేదు కానీ, తన వయసుకు సమానమైన వారు కూడా ఆంటీ అని పిలుస్తూ కామెంట్లు చేయడంతో ఈమె తరచు ఆంటీ ట్రోల్స్ పై స్పందిస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు శివాజీ విషయంలో కూడా మరోసారి తనని ఆంటీ అని సంబోధించడం శివాజీని గారు అంటూ సంబోధించడంతో ఈమె ఈ పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది. మరి వీరిద్దరి మధ్య చెలరేగిన ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

అనసూయ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో శివాజీ వివాదంపై ఆమె స్పందన ఒక ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది. తన పట్ల ట్రోల్స్‌కు ఆమె ఇచ్చిన కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌తో ప్రస్తుతానికి వివాదానికి చెక్ పడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.