
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న యాంకర్ రవి, తన అనుభవం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డబ్బు కోసం షోలోకి వెళ్ళినట్లు చెప్పుకొచ్చిన రవి, తెరవెనుక జరిగిన సంఘటనలను, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొన్న విమర్శలను బయటపెట్టారు.
Key Points
యాంకర్ రవి బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం
కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు వెల్లడి
తెరవెనుక జరిగే నిజాలు, నెగటివిటీని ఎదుర్కొన్న విషయం
సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై ఆవేదన వ్యక్తం
బిగ్ బాస్ షో అనుభవం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులని ఎంపిక చేసే ప్రక్రియని ముందుగానే ప్రారంభించారు. దీనితో బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. గత 8 సీజన్లకు భిన్నంగా సీజన్ 9 ఉండబోతోంది. ఈ సారి షోలో 2 హౌస్ లని తీసుకురాబోతున్నారు. మరిన్ని సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి. బిగ్ బాస్ 9 లాంచ్ సమీపిస్తున్న తరుణంలో యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యాంకర్ రవి గతంలో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. బుల్లితెరపై టాప్ యాంకర్లలో రవి ఒకరు. దీనితో రవి బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో అతడిపై చాలా ఫోకస్ పడింది. కానీ బిగ్ బాస్ షో వల్ల రవి తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొన్నాడు. బిగ్ బాస్ షో వల్ల తనకి చాలా నష్టం జరిగింది అని, సోషల్ మీడియాలో తన జీవితంతో ఆడేసుకున్నారు అన్ని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.
రెమ్యునరేషన్ మరియు ఆర్థిక ప్రయోజనాలు
అసలు నాకు బిగ్ బాస్ షోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చాలా ఏళ్లుగా నేను మా టీవీతో అసోసియేట్ అయి ఉన్నాను. సీజన్ 1 నుంచి వాళ్ళు నన్ను అడుగుతూనే ఉన్నారు. సీజన్ 5లో పాల్గొనమని మరింత ఒత్తిడి చేశారు. ఎలాగోలా తప్పించుకుందాం అని వాళ్ళు ఇవ్వలేని రెమ్యునరేషన్ డిమాండ్ చేశా. నేను అడిగినంత ఇవ్వడానికి వెంటనే ఒకే చెప్పేశారు. అక్కడ లాక్ అయిపోయాను. నో చెప్పలేకపోయాను.
నాకు తెలిసి బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చింది నాకే. కోటి రూపాయలకు అటు ఇటుగా ఇచ్చారు. బిగ్ బాస్ వల్ల నాకు జరిగిన మంచి అదొక్కటే. ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోగలిగాను. బిగ్ బాస్ తెరవెనుక చాలా జరుగుతాయి. బిగ్ బాస్ షోలో చూపించేది గంట మాత్రమే. చుట్టూ కెమెరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నటిస్తారు. రోజులో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒరిజినాలిటీ బయటకి వస్తుంది. బిగ్ బాస్ షోలో నేను నటించలేదు, జెన్యూన్ గా ఉన్నాను అని ఎవరైనా చెబితే వాళ్ళు అబద్దం చెబుతున్నట్లే అని రవి అన్నారు.
తెరవెనుక జరిగిన విషయాలు మరియు సోషల్ మీడియా ప్రభావం
బిగ్ బాస్ షోలో నేను ఒకటి అనుకుంటే మరొకటి అయింది. నెగిటివిటీ వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో నా పర్సనల్ లైఫ్ ని లాగి విమర్శలు చేశారు. అసలు బిగ్ బాస్ షోకి నా పర్సనల్ లైఫ్ కి ఏంటి సంబంధం. బిగ్ బాస్ లో నేను చేసిన దాని గురించి మాట్లాడితే పర్వాలేదు. కానీ నా క్యారెక్టర్ పై మచ్చ వేశారు, పర్సనల్ లైఫ్ ని బయటకి తీశారు. నా జీవితంతో ఆడేసుకున్నారు. అందుకే సోషల్ మీడియాలో నాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై కేసులు పెట్టాల్సి వచ్చింది అని రవి తెలిపారు. ఒక సెలెబ్రిటీ బిగ్ బాస్ షోకి వెళ్లడం వల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదు అని రవి కామెంట్స్ చేశారు.
చివరగా, యాంకర్ రవి తన బిగ్ బాస్ అనుభవాన్ని, ఆ షో వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులను, సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించారు. ఆయన అనుభవం ఇతర కంటెస్టెంట్లకు ఒక హెచ్చరికగా ఉండవచ్చు.


