
📌 Key Points
- యాంకర్ స్రవంతి నటిగా ‘హే భగవాన్’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ!
- సుహాస్, శివాని జంటగా ఫిబ్రవరి 20న విడుదల కానున్న ‘హే భగవాన్’.
- 2009 నుండి నటిగా ప్రయత్నాలు.. ఇన్నేళ్లకు కల నెరవేరిందన్న స్రవంతి.
- గతంలో ‘బ్యాడ్ గర్ల్స్’ సినిమాలో నటించినా అది ఫ్లాప్ కావడంతో మర్చిపోయారా?
యాంకర్ స్రవంతి నటిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ‘హే భగవాన్’ చిత్రంలో ఆమె నటన ఏ విధంగా ఉండబోతుందో చూడాలనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఆమె ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
హీరోయిన్ గా మారిన యాంకర్ స్రవంతి
Anchor Sravanthi : యాంకర్ గా స్రవంతి చొకారపు ఫుల్ ఫామ్ లో ఉంది. సినిమా ఈవెంట్స్ యాంకరింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ బిజీగానే ఉంది. గతంలో బిగ్ బాస్ లో కూడా పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది స్రవంతి. తాజాగా స్రవంతి నటిగా ఎంట్రీ ఇస్తుంది.(Anchor Sravanthi)
సుహాస్, శివాని నగరం జంటగా తెరకెక్కుతున్న హే భగవాన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో యాంకర్ స్రవంతి కూడా నటించింది.
స్రవంతి మొదటి సినిమా ఇదేనా?
ఈ ఈవెంట్లో యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. 2009లో నటి అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. కానీ ఇన్నేళ్లు పట్టింది నటి అవ్వడానికి. ఆ భగవంతుడు హే భగవాన్ తోనే లాంచ్ అవ్వాలని రాసాడేమో. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇల్లేమో దూరం..లో అన్నట్టు ఆ ధైర్యమే ఇన్నేళ్ళుగా నన్ను నడిపించింది. ఇక్కడ నిలబెట్టింది. డైరెక్టర్ గోపి గారు నా నుంచి ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్ కి పిలిచి ఆయనకు కావలసినట్టు నటించేలా చేసారు. ఈ సినిమాలో నేనే సర్ ప్రైజ్. సుహాస్ గారు ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం చాలా సపోర్ట్ చేసారు. మీరు ఈ సినిమా చూసి నన్ను యాక్టర్ గా గుర్తించాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.
‘హే భగవాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్ విశేషాలు
ఇన్నేళ్లు యాంకర్ గా మెప్పించిన స్రవంతి ఇప్పుడు నటిగా మారడంతో ఆమెని అభినందిస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే స్రవంతి ఆల్రెడీ గతంలోనే నటిగా సినిమా చేసింది. బ్యాడ్ గర్ల్స్ అనే సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రే చేసింది. మున్నా డైరెక్టర్ గా తెరకెక్కించిన బ్యాడ్ గర్ల్స్ సినిమా నెల రోజుల క్రితమే డిసెంబర్ 25న రిలీజయింది కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో స్రవంతి ఫస్ట్ సినిమా బ్యాడ్ గర్ల్స్ అయినా అది చిన్న సినిమా కాబట్టి, ఫ్లాప్ అయింది కాబట్టి ఆ సినిమా గురించి ప్రస్తావనే లేకుండా హే భగవాన్ సినిమానే మొదటి సినిమా అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు.
యాంకర్ స్రవంతి హీరోయిన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి. ‘హే భగవాన్’ సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


