
📌 Key Points
- యాంకర్ స్రవంతికి హీరోయిన్ ఛాన్స్.. కానీ పెళ్లి అడ్డంకి!
- తమిళ్ స్టార్ కొడుకు సినిమాలో స్రవంతికి అవకాశం వచ్చి చేజారింది.
- హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాక పెళ్లయిందని చెప్పడంతో షాక్ తిన్న మేకర్స్.
- ఫిబ్రవరి 20న ‘హే భగవాన్’ మూవీ రిలీజ్.. స్రవంతి కీలక పాత్రలో!
యాంకర్ స్రవంతి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా? తమిళ్ స్టార్ హీరో కొడుకు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా? అసలు ఏం జరిగింది? స్రవంతి షాకింగ్ విషయాలు వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
స్రవంతికి హీరోయిన్ అవకాశం..!
Anchor Sravanthi : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న యాంకర్ స్రవంతి ఇప్పుడు సినిమా ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. యాంకర్ నుంచి నటిగా మారింది స్రవంతి. తను కీలక పాత్రలో నటించిన హే భగవాన్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది. (Anchor Sravanthi)
పెళ్లి తర్వాతే అసలు ట్విస్ట్..!
యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. పెళ్లి కాకముందు కూడా సినిమాలు ట్రై చేశాను. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా ట్రై చేశాను. తమిళ్ స్టార్ యాక్టర్ ఆయన తెలుగులో కూడా చాలా సినిమాల్లో చేసారు. ఆయన కొడుకు హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. దానికి హీరోయిన్ గా నన్ను సెలెక్ట్ చేసారు. అంతా ఓకే అయింది. స్క్రీన్ టెస్ట్ కూడా చేసారు. అతనికి, నాకు కలిపి ఫోటోలు తీశారు. ఓకే అనుకున్నారు.
‘హే భగవాన్’ తో నటిగా స్రవంతి
రేపు చెన్నై కి వెళ్లి అక్కడ ఏదో టెస్ట్ షూట్ ఉంది అన్నారు. అడ్వాన్స్ కూడా అక్కడే ఇస్తామన్నారు. ముందు రోజు మేనేజర్ తో మాట్లాడుతూ నాకు తెలియక నాకు పెళ్లి అయింది ఓకే కదా ఈ సంభాషణ ఎప్పుడు రాలేదు అని క్యాజువల్ గా చెప్పాను. అవునా ఒక గంటలో కాల్ చేస్తాను అని చెప్పారు ఇన్నేళ్లు అయిపోయింది మళ్ళీ కాల్ రాలేదు. కాకపోతే ఆ సినిమా కూడా అవ్వలేదు అని చెప్పింది.
స్రవంతి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా వేచి చూడాల్సిందే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


